FactCheck: భజనల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలను పరిష్కరించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారా..?

No, PM Modi never said singing bhajans can solve malnutrition problem. 'మన్ కీ బాత్' 92వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "భజనలు" (భక్తి గీతాలు) పాడటం ద్వారా పోషకాహార లోపం సమస్యను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sept 2022 2:00 PM IST
FactCheck: భజనల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలను పరిష్కరించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారా..?

'మన్ కీ బాత్' 92వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "భజనలు" (భక్తి గీతాలు) పాడటం ద్వారా పోషకాహార లోపం సమస్యను పరిష్కరించవచ్చని అన్నారంటూ పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.

"భజనలు నిర్వహించడం పోషకాహార లోపాన్ని తగ్గించే పరిష్కార మార్గంలో భాగంగా ఉంటుంది" అని ది వైర్ కథనం నేపథ్యంలో ఈ దావా వచ్చింది.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు ప్రధానిపై విమర్శలు

PM Modi never said singing bhajans can solve malnutrition problem చేస్తూ ట్వీట్ చేశారు. "Bhajan as a solution for Malnutrition! That too coming from PM! I seriously hope it was a teleprompter typo where Bhojan was typed in as Bhajan. India is ranked at 101/116 on the global hunger index & we need immediate focus & solution for malnutrition, not these comic capers." అంటూ కేటీఆర్ ట్వీట్ లో చెప్పుకొచ్చారు. "పౌష్టికాహార లోపానికి భజన పరిష్కారం! అది కూడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది టెలిప్రాంప్టర్ అక్షర దోషం అని నేను భావిస్తున్నాను.. ఇక్కడ భోజనాన్ని భజన్ అని టైప్ చేసి ఉంటారు." అని కేటీఆర్ విమర్శించారు. భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 101/116 స్థానంలో ఉంది. దీనికి పరిష్కారం కావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఉప్ప్సల యూనివర్శిటీ ప్రొఫెసర్ అశోక్ స్వైన్ దీనిపై ట్వీట్ చేశారు,"Modi says singing Bhajan (Hindu devotional song) can solve malnutrition problem. Thankfully Nehru is not alive to witness this stupidity!" అని ట్వీట్ లో ఉంది. మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయానికి నెహ్రూ ప్రాణాలతో లేరని చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయి.

NewsMeter బృందం 28 ఆగస్టు 2022న PMO అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించబడిన ప్రధాని మోదీ ప్రసంగాన్ని జాగ్రత్తగా విన్నది. ఇంగ్లీష్, హిందీ ట్రాన్‌స్క్రిప్ట్‌ను చదివింది. దాదాపు 12 నిమిషాల టైమ్‌స్టాంప్‌లో, పిల్లలలో పోషకాహార లోపంపై PM ప్రసంగించారు.

"పాటలు, సంగీతం మరియు భజనలు కూడా పోషకాహార లోపాన్ని తొలగించడానికి ఉపయోగించవచ్చని మీరు ఊహించగలరా? ఇది మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో "మేరా బచ్చా క్యాంపెయిన్"లో విజయవంతంగా ఉపయోగించబడింది. అందుకు సంబంధించి జిల్లాలో భజనలు-కీర్తనలతో కూడిన ప్రోగ్రాంలు నిర్వహించబడ్డాయి. ఇందులో టీచర్లే పోషకాహార గురువులుగా మారారు. మహిళలు అంగన్‌వాడీ కేంద్రానికి పిడికెడు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ ధాన్యంతో శనివారాల్లో 'బాలభోజ్' నిర్వహిస్తారు. అంతేకాకుండా పిల్లల హాజరు శాతం పెరిగింది. అలా పిల్లలకు అందాల్సిన పోషక ఆహారాన్ని అందరూ తీసుకుని వచ్చే వారు.. పంచి పెట్టేవారు. ఈ కార్యక్రమాల కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపం కూడా తగ్గుముఖం పట్టింది." అని ప్రధాని మోదీ అన్నారు.

భక్తిగీతాలు పోషకాహార లోపాన్ని నయం చేయగలవని ప్రధాని మోదీ ఎక్కడా చెప్పలేదని.. ఈ సారాంశం ద్వారా స్పష్టమవుతుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పాటలు, భజనలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల హాజరు శాతం పెరగడం వల్ల పోషకాహార లోపం తగ్గుముఖం పట్టిందని తెలిపారు

భజనల ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలను పరిష్కరించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పలేదు. వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి.

Claim Review:PM Modi never said singing bhajans can solve malnutrition problem
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:False
Next Story