కంగనా రనౌత్ ట్విట్టర్ లోకి తిరిగి వచ్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎలోన్ మస్క్ బృందం నటి ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరింపజేసిందనే వాదనతో షేర్ చేస్తున్నారు. ఆ ట్వీట్‌లో, "ధన్యవాదాలు ఎలోన్ మస్క్, నేను ఇప్పుడు తిరిగి వచ్చాను!!"("Thanks Elon Musk, I am Back now!!")
టెస్లా CEO ఎలాన్ మస్క్ $44 బిలియన్ల ఒప్పందం ద్వారా ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ పోస్టు వైరల్ గా మారింది.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు ట్వీట్‌ను షేర్ చేస్తూ, "#ElonMusk అత్యంత వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు!"(#ElonMusk Reinstates The Most Controversial Bollywood Actress Kangana Ranaut Twitter Account!) అంటూ పోస్టులు పెట్టారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసపై ఆమె చేసిన వివాదాస్పద ట్వీట్లతో గత ఏడాది మేలో రనౌత్ ఖాతా శాశ్వతంగా తొలగించబడింది. ట్విట్టర్ ఖాతా "ద్వేషపూరిత ప్రవర్తన మరియు దుర్వినియోగ ప్రవర్తన"("hateful conduct and abusive behaviour.") పై సోషల్ మీడియా సైట్ పాలసీ పదేపదే ఉల్లంఘించిందని పేర్కొంది.
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం ట్విట్టర్ ఖాతాను @TheKangnaRanut వైరల్ స్క్రీన్ షాట్ లో గుర్తించింది.
మేము Twitterలో వినియోగదారు పేరు కోసం శోధించాము. ఖాతా ధృవీకరించబడలేదని, అక్టోబర్ 2022లో Twitterలో చేరిందని కనుగొన్నాము.
మేము రనౌత్ చేసిన ట్వీట్ కోసం శోధించాము. ఆమె ధృవీకరించబడిన ఖాతా యొక్క ట్విట్టర్ హ్యాండిల్ "@KanganaTeam" అని గుర్తించాము.
మేము ట్విట్టర్ లో "@KanganaTeam" సెర్చ్ చేశాం.. ఆ అకౌంట్ ఇంకా సస్పెన్షన్ లోనే ఉందని గుర్తించాం.
అక్టోబరు 28న, ఎలోన్ మస్క్ ఒక ట్వీట్‌లో, ఖాతా పునరుద్ధరణలు, కంటెంట్ నిర్ణయాలపై కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ నిర్ణయిస్తుందని, ఈ కౌన్సిల్ సమావేశానికి ముందు ఎటువంటి నిర్ణయం తీసుకోబడదని ప్రకటించారు.
కంగనా రనౌత్ లాంటి ఖాతా నకిలీదని స్పష్టమైంది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
అంతకుముందు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరడీ ఖాతాకు సంబంధించిన ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత శాశ్వతంగా సస్పెండ్ చేయబడిన ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడిందని తప్పుగా క్లెయిమ్ చేయబడింది. న్యూస్‌మీటర్ ద్వారా ఆ పోస్టుల్లో నిజం లేదని స్పష్టంగా తేల్చింది.Kangana Ranaut's Twitter account has been reinstated