FactCheck: భారత్ ఆర్థిక మాంద్యం బారిన పడుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారా..?

No, former RBI governor Raghuram Rajan never said India must be hit by recession to show inclusivity. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారంటూ ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Sept 2022 9:30 PM IST
FactCheck: భారత్ ఆర్థిక మాంద్యం బారిన పడుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారా..?

"ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారంటూ ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశం మాంద్యం బారిన పడక తప్పదని రాజన్ చెప్పినట్లు కథనాలు వైరల్ అవుతున్నాయు.

ఆర్‌బీఐ మాజీ గవర్నర్, ఎకానమిస్ట్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ.. భారత్ త్వరలో ఆర్థిక మాంద్యం బారిన పడబోతోందని హెచ్చరించినట్లుగా ఓ కోట్ వైరల్ అవుతోంది. ఒకవేళ భారత్ ఆర్థిక మాంద్యం బారిన పడుకున్నా.. పలు దేశాలు కలిసి భారత్ ను కార్నర్ చేసే అవకాశం ఉందని వైరల్ పోస్టులో చెబుతున్నారు.

ఆ పోస్టులో "Former Governor of RBI and Super Star Economist Raghuram Rajan said, India must get hit by recession to show inclusivity. Albert Einstein once famously said: Two things are infinite: the universe and human stupidity. I am not sure about the universe. Very aptly said Einstein Uncle." అని ఉంది.

వ్యంగ్య ధోరణలో నకిలీ వార్తలను ప్రచారం చేయడంలో పేరు తెచ్చుకున్న ది ఫాక్సీ అనే వెబ్‌సైట్ ఈ కథనాన్ని ప్రచురించిన తర్వాత వైరల్ అవుతోంది.

కథనంలో రెండు వాదనలు ఉన్నాయి: మొదటగా, రాజన్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, " భారతదేశం త్వరలోనే మాంద్యం బారిన పడాలి" అని అన్నారు. రెండవది, రాజన్ "భారతదేశాన్ని ఆర్థిక మాంద్యం తాకకపోయినా ఇతర దేశాలు కలిసి టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి." చాలా మంది ట్విటర్ వినియోగదారులు ఇదే వాదనలు చేశారు.

నిజ నిర్ధారణ:

NewsMeter ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కు ఆపాదించబడిన క్లెయిమ్‌లను కనుగొనడానికి కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసింది. ది ఫాక్సీ ప్రచురించిన కథనం మినహా ప్రధాన స్రవంతి మీడియా ద్వారా మాకు ఎటువంటి వార్తా నివేదిక కనిపించలేదు. ఫాక్సీ తనను తాను వినోద వేదికగా పేర్కొంది. వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన అన్ని కథనాలు తప్పుదారి పట్టించేవి, ఫాక్ట్ చెక్ చేస్తే చాలా వరకూ అబద్ధాలేనని తేలింది.

"The Fauxy is an entertainment portal. The content of this website is purely for entertainment purposes and readers are advised not to confuse the articles of The Fauxy as genuine and true." అంటూ తమ వెబ్ సైట్ గురించి చెప్పుకున్నారు. తాము తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుంటామని ఒప్పేసుకున్నారు.

ఇక వెబ్సైట్ 'about' సెక్షన్ లో "The Fauxy is an entertainment media company that connects with young, intelligent and diverse audiences that are shaping our future. Through thought-provoking comedy and high-impact storytelling, we aim to start a conversation around subjects that are usually viewed as taboo for today's youth." అని ఉంది.


ఫాక్సీ అనేది మన భవిష్యత్తును రూపొందించే యువ, తెలివైన, విభిన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే వినోద మీడియా సంస్థ అని తెలిపారు. ఆలోచింపజేసే కామెడీ తమ సొంతమని తెలిపింది. ఈనాటి యువతకు సాధారణంగా నిషిద్ధంగా భావించే విషయాల గురించి సంభాషణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు.

రఘురామ్ రాజన్‌ను ఆపాదిస్తూ వెబ్‌సైట్, సోషల్ మీడియా వినియోగదారులు చేసిన దావా తప్పు అని మేము నిర్ధారించాము.

న్యూస్‌మీటర్ కూడా రాజన్‌ను సంప్రదించింది. కానీ ఇంకా ఆయన నుండి స్పందన రాలేదు. మేము ప్రతిస్పందన వచ్చినప్పుడు కథనాన్ని అప్డేట్ చేస్తాము.

Claim Review:Fake claims circulated on Facebook and Twitter stating former Governor Raghuram Rajan said, "India must get hit by recession to show inclusivity"
Claimed By:The Fauxy, Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:The Fauxy
Claim Fact Check:False
Next Story