నిజమెంత: ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు డ్రోగ్బా ఇస్లాం మతాన్ని స్వీకరించాడా..?

No footballer Didier Drogba did not convert to Islam.ఫుట్‌బాల్ ఆటగాడు డిడియర్ డ్రోగ్బా ఇస్లాం మతంలోకి మారాడని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Nov 2022 5:33 AM GMT
నిజమెంత: ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు డ్రోగ్బా ఇస్లాం మతాన్ని స్వీకరించాడా..?

ఫుట్‌బాల్ ఆటగాడు, ఐవరీ కోస్ట్ మాజీ కెప్టెన్ డిడియర్ డ్రోగ్బా ఇస్లాం మతంలోకి మారాడని పేర్కొంటూ సోషల్ మీడియా వినియోగదారులు పలు ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఫోటోలలో అతను ప్రార్థిస్తున్నట్లు చూడవచ్చు.

ఫేస్‌బుక్ యూజర్ ఫోటోలను షేర్ చేస్తూ, "మాజీ ఐవోరియన్ స్టార్ డిడియర్ డ్రోగ్బా ఇస్లాంలోకి మారారు..." అని రాశారు. ("Former Ivorian star Didier Drogba converts to Islam…")


చాలా మంది ట్విట్టర్, ఫేస్‌బుక్ వినియోగదారులు అదే దావాతో ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. (మరిన్ని పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్ చేయండి.)

నిజనిర్ధారణ:

NewsMeter బృందం ఇందుకు సంబంధించిన వార్తా నివేదికల కోసం వెతకగా, డ్రోగ్బా ఇస్లాం మతంలోకి మారినట్లు వచ్చిన వార్తలను తిరస్కరించినట్లు తెలిపే BBC కథనం నవంబర్ 9న గుర్తించాం.

స్పోర్ట్స్ బ్రీఫ్ అనే వెబ్‌సైట్, మాజీ చెల్సియా స్ట్రైకర్ ఇస్లాం మతంలోకి మారినట్లు వచ్చిన వార్తలను తిరస్కరించాడని.. అతను తన గ్రామాన్ని సందర్శించినప్పుడు తన ముస్లిం సోదరుల ప్రార్థనలకు గౌరవం ఇస్తూ ప్రార్థనల్లో పాల్గొన్నారని నివేదించింది.


ఫుట్‌బాల్ లెజెండ్ కూడా తాను మతం మారలేదని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు. వైరల్ ఫోటోలలో తాను తన ముస్లిం సోదరులకు గౌరవం ఇస్తున్నట్లు తెలిపారు. అతని గ్రామాన్ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోలు ఇవని స్పష్టం చేశారు.

"This story is going viral 😅 but I haven't changed religion.

This was just me paying respect to my Muslim brothers i was visiting in my village. A moment of togetherness.

Much love and blessings to all" అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు డిడియర్ డ్రోగ్బా.

కాబట్టి డిడియర్ డ్రోగ్బా ఇస్లాం మతాన్ని స్వీకరించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story