Fact Check: కార్లు అలా తిరగబడడం వెనుక దెయ్యాలు ఉన్నాయా..?

Neither supernatural nor ghostly: Video of cars crashing in air is digital creation. సోషల్ మీడియాలో దెయ్యాలు, భూతాలు అంటూ జరిగే ప్రచారానికి బాగా వ్యూవర్ షిప్ ఉంటుంది. నిజమేనని నమ్మేస్తూ పోస్టులు షేర్ చేసే వారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2022 4:15 PM GMT
Fact Check: కార్లు అలా తిరగబడడం వెనుక దెయ్యాలు ఉన్నాయా..?

సోషల్ మీడియాలో దెయ్యాలు, భూతాలు అంటూ జరిగే ప్రచారానికి బాగా వ్యూవర్ షిప్ ఉంటుంది. నిజమేనని నమ్మేస్తూ పోస్టులు షేర్ చేసే వారు చాలా మందే ఉన్నారు. అలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కార్లు తిరగబడానికి.. ఒక్కసారిగా కార్ల ముందు భాగాలకు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం దెయ్యాలే అంటూ సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. కార్లు వెళుతూ ఉండగా.. ఒక్క సారిగా ముందు భాగంలో యాక్సిడెంట్ అవ్వడం జరుగుతుండడం చూడవచ్చు.

ఒక్కసారిగా దూసుకుపోతున్న కార్లకు యాక్సిడెంట్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

"Science can't explain this," అని వీడియో శీర్షికతో పోస్టులను పెడుతూ ఉన్నారు.

కొందరు ఈ ఘటనలకు దెయ్యాలే కారణమని ప్రచారం చేస్తూ ఉన్నారు. మరికొందరు దీనిని అతీంద్రియ శక్తుల పనే అని నమ్మించడం మొదలుపెట్టారు.

అయితే ఇక్కడ ఏమి జరుగుతొందో మనం తెలుసుకుందామా..?

నిజ నిర్ధారణ:

NewsMeter Youtubeలో కీవర్డ్ శోధనను నిర్వహించింది. అందుకు సంబంధించిన వీడియోను 'BHG Music World' అనే యూట్యూబ్ ఛానల్ లో 'GHOST ACCIDENTS REALITY | CAR CRASH' అనే పేరుతో అప్లోడ్ చేశారు.

ఈ వీడియోలో.. ఇలాంటి వీడియోలను ఎలా ఎడిట్ చేస్తున్నారో వివరించారు. మేము మరిన్ని వివరాల కోసం YouTube వీడియో పెట్టిన పేజీలో సూచనను కనుగొన్నాము. ఇవన్నీ ట్రాఫిక్ ప్రమాదాలని స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇటాలియన్ యానిమేషన్/గ్రాఫిక్స్ కళాకారుడు డోనాటోసాన్సోన్ ఎడిటింగ్ చేశారని చెప్పుకొచ్చారు. 'Footage purporting to show 8 traffic accidents involving invisible ghost cars was the product of creative digital editing by Italian animation/graphics artist DonatoSansone'. అని క్లారిటీ గా వివరించారు.

ఆర్టిస్ట్ పేరును చూసి మేము DonatoSansone అధికారిక పేజీని పరిశీలించాము. అతని అధికారిక పేజీ 'Vimeo'ని కనుగొన్నాము, అతను 2018లో 'ghoatCRASH' పేరుతో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో హిట్ అవ్వడమే కాకుండా వైరల్ గా మారింది.

కారు ప్రమాదానికి గురైన వీడియోలు అతీంద్రియ శక్తుల పనో.. భూతాల పనో కాదని తెలుసుకున్నాము. ఇటాలియన్ యానిమేషన్ కళాకారుడు డోనాటో సాన్సోన్ అద్భుతమైన ఎడిటింగ్ నైపుణ్యాల ఫలితమేనని తెలిసింది.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:కార్లు అలా తిరగబడడం వెనుక దెయ్యాలు ఉన్నాయా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter telugu
Claim Source:Social Media
Claim Fact Check:Misleading
Next Story