"తాగిన మైకంలో పాఠశాలలో ఉన్న సరస్వతీ మాత చిత్రాన్ని తన్నుతున్న క్రై ఉపాధ్యాయుడు" అనే సందేశంతో ఒక వీడియోను 'కాల భైరవ రిటర్న్' అనే పేరున ఉన్న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
ఇక 15 సెకన్లు ఉన్న ఇదే వీడియోను మరొక నెటిజన్ "సరస్వతి మాత చిత్ర పటాన్ని కాలితో తంతున్న ఎడారి మతానికి చెందిన ఉపాధ్యాయుడు" ఈ సందేశంతో పోస్ట్ చేశారు.
నిజ నిర్ధారణ:
సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలో నిజం ఎంత?!ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్. దీంతో ట్విట్టర్లో కూడా నెటిజన్లు ఇదే వీడియోని పోస్ట్ చేశారని, అయితే సరస్వతి దేవి ఫోటోని తన్నిన వ్యక్తిని ముస్లింగా పేర్కొన్నట్టు అందులో ఉంది.
అయితే ఈ ట్వీట్ కింద కామెంట్స్ ని గమనించినప్పుడు ఈ సంఘటన గుజరాత్ లో జరిగినట్టుగా, అలాగే ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి ఆదివాసి కమ్యూనిటీకి చెందిన వాడుగా పేర్కొన్నారు ఒక నెటిజన్.
ఈ కామెంట్స్ ని ఆధారంగా చేసుకుని మరోసారి కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో ఈ వార్తను ప్రచురించింది గుజరాత్ కు చెందిన సందేశ్ పత్రికగా తెలిసింది. వైరల్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఛోటా ఉదేపూర్ జిల్లాలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. తాగిన మైకంలో విష్ణుభాయ్ రథ్వా అనే టీచర్, క్వాంట్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి చిత్రపటాన్ని కాలితో తన్నినట్టుగా తేలింది.
ఇవే వివరాల్ని సందేశ్ తన యూట్యూబ్ ఛానల్ లో కూడా పబ్లిష్ చేసింది.
Dec 31, 2022 రోజున News18 Gujarati న్యూస్ ఛానల్ ట్విట్టర్ లో Galesar school of Kawant taluka లో ఈ సంఘటన జరిగినట్టుగా ట్వీట్ చేసింది.
తాగిన మత్తులో యోగేష్ అనే టీచర్, ఛోటా ఉదేపూర్ జిల్లా లో ఉన్న క్వాంట్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి చిత్రపటాన్ని కాలితో తన్నడంతో పాటుగా తోటి ఉపాధ్యాయులని దూషించాడని కూడా ఆజ్ తక్ వివరించింది.
సో, సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయినట్టుగా వీడియోలో సరస్వతి దేవి ఫోటోని తన్నిన వ్యక్తి ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ కాదు. తగిన మత్తులో సరస్వతి దేవి చిత్రపటాన్ని తన్నిన వ్యక్తి యోగేష్ రథ్వా.