బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలను చేపట్టారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఫోన్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సునాక్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మోదీ... రిషి సునాక్ తో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. కలిసి పని చేద్దామని.. భారత్, బ్రిటన్ ల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని మోదీ ఆయనకు తెలిపారు.
అయితే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో రిషి సునాక్ ఫోటో దిగాడని చెబుతూ పలువురు పోస్టులను వైరల్ చేస్తున్నారు. రిషి సునక్‌తో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నట్లు నివేదించబడిన పాత ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. వైరల్ ఫోటోకు #RishiSunak, #ViratKohli అనే హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్‌లో ఇలాంటి పోస్ట్‌లను ఇక్కడ చూడవచ్చు.
ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకుందాం.
నిజ నిర్ధారణ:
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2017లో NDTV ప్రచురించిన నివేదికకు దారితీసింది. ఈ నివేదిక "ఆశిష్ నెహ్రా, విరాట్ కోహ్లీ.. పాత చిత్రం" అనే పేరుతో ఉంది. ఆశిష్ నెహ్ర చాలా కాలం ముందు విరాట్ కోహ్లీతో ఉన్నట్టు ఫోటో స్పష్టంగా పేర్కొంది.
మేము ధృవీకరించిన ఖాతాల నుండి అదే విధంగా ట్వీట్‌లను కూడా కనుగొన్నాము.
ఇదే చిత్రాన్ని క్రికెటర్ విరాట్ కోహ్లీ..చిన్ననాటి చిత్రాలతో పాటు క్రికెట్‌న్‌మోర్ ప్రచురించింది. "విరాట్ కోహ్లీ, ఆశిష్ నెహ్రా" అనే ట్యాగ్‌తో చిత్రాన్ని చూడవచ్చు.
విరాట్ కోహ్లీతో ఉన్న వ్యక్తి కొత్తగా నియమితులైన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కాదని, క్రికెటర్ ఆశిష్ నెహ్రా అని స్పష్టమైంది.