Fact Check: ఇది ఇటీవల భారత్‌లో విడుదల చేసిన చిరుతలకు సంబంధించిన వీడియోనా?

Is this a video of the cheetahs recently bought to India?. ఓ చిరుతపులి ఓ కోతిని వేటాడి చంపేసి ఉండగా.. ఆ తల్లికి పిల్ల కోతి హత్తుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2022 8:24 AM GMT
Fact Check: ఇది ఇటీవల భారత్‌లో విడుదల చేసిన చిరుతలకు సంబంధించిన వీడియోనా?

ఓ చిరుతపులి ఓ కోతిని వేటాడి చంపేసి ఉండగా.. ఆ తల్లికి పిల్ల కోతి హత్తుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల నమీబియా నుండి భారతదేశానికి తీసుకువచ్చిన చిరుతలకు సంబంధించిన వీడియో అనే వాదనతో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

ప్రాజెక్ట్ చీతా కింద ఐదు ఆడ, మూడు మగ ఆఫ్రికన్ చిరుతలను భారతదేశానికి తీసుకువచ్చిన తర్వాత వీడియోలు, చిత్రాలతో పాటు అనేక నకిలీ వాదనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

"చరిత్ర పునరావృతమవుతోంది; స్వదేశీలను చంపడానికి విదేశీయులను తీసుకువస్తున్నారు" అని ఫేస్‌బుక్ వినియోగదారు వీడియోను షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.

ఈ వీడియోను షేర్ చేసిన మరో ఫేస్‌బుక్ యూజర్ కూడా అదే వాదనను వినిపించారు.

నిజ నిర్ధారణ:

NewsMeter వీడియో యొక్క కీ ఫ్రేమ్‌ల యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించింది. 21 అక్టోబర్ 2021న డైలీ మెయిల్ ప్రచురించిన కథనంలో ఇలాంటి ఫోటోలను కనుగొంది. "Heartbreaking end for a helpless baby monkey: Infant clings to its dead mother as leopard clamps her lifeless body in its jaws - before big cats devour both of them." అంటూ ఆర్టికల్ ను పోస్టు చేశారు.

నిస్సహాయ పిల్ల కోతికి హృదయ విదారక ముగింపని చెప్పుకొచ్చారు. చిరుతపులి తల్లి కోతి శరీరాన్ని దాని దవడలలో పట్టుకుని ఉండగా.. పిల్ల కోతి తన చనిపోయిన తల్లిని హత్తుకుని ఉంది. జాంబియాలోని సౌత్ లుయాంగ్వా నేషనల్ పార్క్‌లో వెర్వెట్ కోతిని చిరుతపులి చంపిందని ఇది నివేదించింది. పిల్ల కోతి తన తల్లిని వదలడానికి నిరాకరించింది.

హృదయాన్ని కదిలించే ఈ క్షణాన్ని వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ షఫీక్ ముల్లా తన కెమెరాలో బంధించారు. "Nature is not always pretty and this picture definitely shows us the harsh reality of life." అని కథనం నివేదించింది.


షఫీక్ ముల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఇలాంటి ఫోటోను కూడా మేము కనుగొన్నాము.

మేము వైరల్ వీడియోలోని వాటర్‌మార్క్ "IGORALTUNA" కోసం శోధించాము. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిన ఇగోర్ ఆల్టునా 29 నవంబర్ 2021న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాము.

వైరల్ అవుతున్న వీడియో జాంబియాకు చెందినది. భారతదేశానికి చెందినది కాదు.

Next Story