నిజ నిర్దారణ: స్మృతి ఇరానీ కుమార్తెకు చెందిన గోవా రెస్టారెంట్‌లో బీఫ్ వడ్డిస్తున్నారా..?

Goa restaurant owned by Smriti Iranis daughter does not serve beef tongue. 'బీఫ్ టంగ్' వంటకాన్ని రెస్టారెంట్‌లో వడ్డిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి.

By అంజి  Published on  29 July 2022 9:15 PM IST
నిజ నిర్దారణ: స్మృతి ఇరానీ కుమార్తెకు చెందిన గోవా రెస్టారెంట్‌లో బీఫ్ వడ్డిస్తున్నారా..?

'బీఫ్ టంగ్' వంటకాన్ని రెస్టారెంట్‌లో వడ్డిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. అది కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె నడుపుతున్న రెస్టారెంట్‌లో అంటూ ప్రచారం చేస్తున్నారు.

రెస్టారెంట్ మెనూ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మెనూ కార్డ్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి చెందిన 'సిల్లీ సోల్స్ గోవా కేఫ్ & బార్' అనే గోవా రెస్టారెంట్‌కు చెందినదని వాదిస్తున్నారు.



నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.

ఇటీవల సిల్లీ సోల్స్ గోవా కేఫ్ అండ్‌ బార్ వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో స్మృతి ఇరానీ కుమార్తె నకిలీ లైసెన్స్‌తో అక్రమంగా నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. స్మృతి కూతురు 18 ఏళ్ల జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్మృతి ఇరానీని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరానీ కూతురు గోవాలో రెస్టారెంట్ నడుపుతోందని, అందులో నకిలీ లైసెన్స్ తో బార్ నడుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాకు తెలిపారు.

ఇక ఈ వైరల్ ఫోటోపై NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. అదే మెనూని జస్ట్ డయల్‌లో కనుగొంది. ఇది గోవాలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లోని రెస్టారెంట్ అయిన 'అప్పర్ డెక్' అని పిలువబడే మరొక రెస్టారెంట్ మెనూ అని నిర్ధారించింది. మేము Zomatoలో అదే మెనుని కనుగొన్నాము. ఇది గోవాలోని అప్పర్ డెక్ కు సంబంధించినదని నిర్ధారించారు.

మేము వైరల్ మెనూని.. గోవాలోని సిల్లీ సోల్స్‌తో సరి పోల్చాము. అవి కాస్తా భిన్నంగా ఉన్నాయని కనుగొన్నాము. వైరల్ చిత్రం అప్పర్ డెక్ మెనూతో సరిపోలింది. అది సిల్లీ సోల్స్ రెస్టారెంట్‌కు సంబంధించింది కాదు.


న్యూస్ మీటర్ బృందం అప్పర్ డెక్ రెస్టారెంట్ యాజమాన్యాన్ని సంప్రదించింది. వైరల్ అవుతున్న మెనూ కార్డు తమదేనని చెప్పుకొచ్చారు. అయితే అది మూడు సంవత్సరాల కిందటిదని తెలిపారు. ప్రస్తుతం తమ రెస్టారెంట్ లో బీఫ్ ఐటెమ్స్ వడ్డించడం లేదని అన్నారు. అప్పర్ డెక్‌ మేనేజర్‌ మాట్లాడుతూ వైరల్ మెనూ తమదేనని నిర్ధారించారు. "అవును, వైరల్ మెనూ కార్డ్ మాదే కానీ ఇది మూడేళ్ల నాటి మెనూ. మేము మా మెనూని మార్చాము. ఇకపై బీఫ్ వడ్డించము" అని ఆయన చెప్పారు.

కాబట్టి, వైరల్ క్లెయిమ్ అబద్ధమని స్పష్టమవుతోంది.

Claim Review: స్మృతి ఇరానీ కుమార్తెకు చెందిన గోవా రెస్టారెంట్‌లో బీఫ్ వడ్డిస్తున్నారా..?

Claimed By: Social Media Users

Claim Reviewed By: Newsmeter Telugu

Claim Source: Social Media Users

Claim Fact Check: False

Next Story