యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్-గాజా వివాదంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. హౌతీల నుండి క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ఇటీవల యెమెన్‌లోని హౌతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది.
హౌతీ, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్న సందర్భంలో యెమెన్ ఇజ్రాయెల్ నౌకపై దాడి చేసిందని పేర్కొంటూ మంటల్లో చిక్కుకుపోయిన ఓడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేసి "యెమెన్ ఒక ఇజ్రాయెల్ నౌకను సముద్రపు అడుగుభాగానికి పంపింది" అని రాశారు. (ఆర్కైవ్)
పలువురు ఫేస్‌బుక్ యూజర్లు కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ వాదనలో నిజం లేదని కనుగొంది. 2022లో నైజీరియా తీరంలో ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేయగా, మేము అదే వీడియోను ధృవీకరించిన X-హ్యాండిల్ అలెఫ్ లో ఫిబ్రవరి 3, 2022న పోస్ట్ చేశారని గుర్తించాం. ఆ ఫుటేజ్‌లో నైజీరియన్‌లోని ట్రినిటీ స్పిరిట్ ఆయిల్ ట్యాంకర్ పేలుడు జరిగిన పోస్ట్ అని తెలిపింది. (ఆర్కైవ్)
ఫిబ్రవరి 3, 2022న న్యూస్‌వీక్ ప్రచురించిన నివేదికలో ‘Trinity Spirit Oil Tanker That Can Carry 2 Million Barrels Explodes at Sea.’ అనే టైటిల్ తో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపింది. 2 మిలియన్ బ్యారెల్స్‌ను మోసుకెళ్లగల ట్రినిటీ స్పిరిట్ ఆయిల్ ట్యాంకర్ సముద్రంలో పేలిందని కథనంలో వివరించింది.
ఫ్లోటింగ్ ప్రొడక్షన్ స్టోరేజ్ అండ్ ఆఫ్‌లోడింగ్ (FPSO) యూనిట్‌గా గుర్తించిన ఈ నౌక నైజీరియాకు చెందిన షెబా ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ లిమిటెడ్ (SEPCOL) యాజమాన్యంలో ఉంది.
నైజీరియన్ న్యూస్ అవుట్‌లెట్‌లు, ఇండియన్ న్యూస్ ఛానెల్ టైమ్స్ నౌ కూడా 2022లో జరిగిన సంఘటనను అవే వివరాలతో నివేదించాయి.
అందువల్ల, ఇజ్రాయెల్ నౌకలపై యెమెన్ కు చెందిన హౌతీ దళాలు దాడి చేశాయని వీడియో చూపించలేదని మేము నిర్ధారించాము.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
క్రెడిట్: Md Mahfooz Alam