నిజమెంత: విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్.. అంబానీ కుటుంబం తీసుకుని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అతని కుమారుడు అనంత్ అంబానీ ‘ఏవియేటర్ బై అంబై’ అనే ఇన్వెస్ట్‌మెంట్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: విరాట్ కోహ్లీ, హృతిక్ రోషన్.. అంబానీ కుటుంబం తీసుకుని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అతని కుమారుడు అనంత్ అంబానీ ‘ఏవియేటర్ బై అంబై’ అనే ఇన్వెస్ట్‌మెంట్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాప్‌ను క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటుడు హృతిక్ రోషన్ కూడా ప్రమోట్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
వీడియోలో:
ముఖేష్ అంబానీ: “ఆటగాళ్లకు ‘95 శాతం’ విన్నింగ్ రేటును సాధించడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు, వేలాది మంది భారతీయులు తమ సులభంగా డబ్బులను పెంచుకునే అవకాశం ఉంది.”
అనంత్ అంబానీ: “ఏవియేటర్ అనేది పెట్టుబడి గేమ్, ఇక్కడ ఎవరైనా త్వరగా, సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ప్రారంభించడానికి మీకు రూ. 500 మాత్రమే అవసరం, విమానం ఎగురుతున్న కొద్దీ, మీ పందెం అనేక రెట్లు పెరుగుతుంది. ఒకే రౌండ్‌లో, మీరు మీ మొత్తాన్ని 10, 20 లేదా 100 రెట్లు పెంచుకోవచ్చు.”
విరాట్ కోహ్లీ: 500 రూపాయలతో, రూ. 2,50,000 వరకు సంపాదించుకోవచ్చు
హృతిక్ రోషన్: “ఈ అప్లికేషన్ పూర్తిగా ఉచితం, ఎటువంటి ప్రకటనలు లేవు. డిపాజిట్‌పై బోనస్ అందుబాటులో ఉంది. ప్రతి మూడు రోజులకు 100 మిలియన్ల జాక్‌పాట్ ఉంటుంది.”
ఫేస్‌బుక్ వినియోగదారు షేర్ చేసిన ఈ వీడియోను పరిశీలించగా పోస్ట్‌లోని లింక్‌ను ఉపయోగించి యాప్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని కోహ్లీ కోరుతున్న ఆడియోతో ముగుస్తుంది.
నిజ నిర్ధారణ:
అంబానీలు లేదా వీడియోలో కనిపించిన ఇతరులు అలాంటి గేమింగ్ యాప్‌నుప్రమోట్ చేయలేదని, ఈ వాదన తప్పు అని NewsMeter కనుగొంది. వీడియోను AI ఉపయోగించి తయారు చేశారు.
ఆడియోకు వీడియోకు ఎలాంటి మ్యాచింగ్ లేదని మేము కనుగొన్నాం. పెదవి కదలికలు, అస్పష్టమైన పదాలు, హిందీ పదాలను ఉపయోగించడం వంటి అనేక వ్యత్యాసాలను మేము వీడియోలో గమనించాము. కోహ్లీ, హృతిక్ రోషన్ ప్రకటనలు ఎడిట్ చేశారు.
ముకేష్, అనంత్ అంబానీ:
మేము వీడియోను కీఫ్రేమ్‌లుగా విభజించాము కానీ ముఖేష్ అంబానీ కీఫ్రేమ్ చాలా చిన్నదిగా ఉన్నందున దాని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయలేకపోయాము. అనంత్ అంబానీ కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఫిబ్రవరి 26, 2024న కనక్ న్యూస్ ప్రచురించిన అసలు వీడియో మాకు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనంత్ అంబానీ ‘వంతరా’ స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిందని తెలిపారు.
ఈ వీడియోలో, అనంత్ అంబానీ తన ‘రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్’ గురించి, ఏనుగుల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఈ వీడియోలో ఏవియేటర్ గేమింగ్ యాప్‌ను ప్రకటించినట్లు కనిపించలేదు.
విరాట్ కోహ్లీ:
కోహ్లీ కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫిబ్రవరి 26, 2023న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూట్యూబ్ ఛానెల్‌లో ‘Virat Kohli on EatSure Presents RCB Podcast Full Episode’ అనే శీర్షికతో ప్రచురించిన 46 నిమిషాల పాడ్‌కాస్ట్‌కు దారితీసింది.
ఈ వీడియోలో విరాట్ కోహ్లీ MS ధోనితో తన స్నేహం గురించి మాట్లాడారని అదే తేదీన ఫ్రాంచైజ్ ప్రచురించిన పాడ్‌కాస్ట్ నుండి రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న క్లిప్‌ను కూడా మేము కనుగొన్నాము.
ఈ వీడియోలలో గేమింగ్ యాప్‌ను కోహ్లీ ప్రచారం చేసినట్లు కూడా మాకు సాక్ష్యాలు లభించలేదు.
హృతిక్ రోషన్
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా రోషన్ అసలు వీడియోను ఫిలిం కంపానియన్ యూట్యూబ్ ఛానెల్ లో గుర్తించాము. జనవరి 29, 2024న అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూ విజువల్స్ ను వైరల్ వీడియో కోసం వాడారు.
ఆ ఛానల్ ప్రకారం, రోషన్ ఇంటర్వ్యూలో తన సినిమా ఫైటర్ గురించి చర్చించాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడాడు కూడా!! చిత్రనిర్మాణ ప్రక్రియ పట్ల తనకున్న మక్కువను వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలో ఎక్కడా నటుడు అంబానీ పెట్టుబడి యాప్‌ను ప్రమోట్ చేయలేదు.
ఆడియో ప్రామాణికత:
మేము AI-డిటెక్షన్ టూల్ హైవ్ మోడరేషన్ ఉపయోగించి ముఖేష్ అంబానీ క్లిప్‌ను విశ్లేషించాము. ఆడియో 99 శాతం కాన్ఫిడెన్స్ స్కోర్‌తో AI ద్వారా జనరేట్ చేశారని, వీడియో ఒరిజినల్‌గా ఉందని నిర్ధారించింది. మొత్తం విశ్లేషణలో వీడియో 99.8 శాతం ఖచ్చితత్వంతో AI-జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను కలిగి ఉందని నిర్ధారించింది.
యాప్ డౌన్‌లోడ్‌ను ప్రమోట్ చేస్తున్న డొమైన్ గురించి:
ప్లే స్టోర్ లోగోను ఉపయోగించిన amba-wheel.icu డొమైన్‌తో లింక్‌ను మేము పరిశీలించాము. స్కామ్ డిటెక్టర్ ప్రకారం, డొమైన్ ఫిబ్రవరి 20, 2025న సృష్టించారు. ఇది చట్టబద్ధమైనది కాకపోవచ్చు. ట్రస్ట్ ఇండెక్స్ దీనికి 100కి 6.2 రేటింగ్ ఇచ్చింది. డొమైన్ వెబ్, యాప్ డెవలప్‌మెంట్ పరిశ్రమతో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అందువల్ల, అంబానీ కుటుంబ సభ్యులు, కోహ్లీ, హృతిక్ రోషన్‌లను కలిగి ఉన్న వైరల్ వీడియో వివిధ వీడియోల క్లిప్‌లను కలపడం ద్వారా సృష్టించారు. AIని ఉపయోగించి ఆడియోను ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.
Credit: Mahfooz Alam