భారతదేశంలో ఇటీవల అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. రైల్వే భద్రత గురించి ఆందోళనలు కూడా పెరిగాయి. జూన్ 2024లో, పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది, ఫలితంగా తొమ్మిది మంది మరణించారు.. అనేక మంది గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో స్టేషన్ ప్లాట్‌ఫాంపై నడుస్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఈ ప్రమాదం జరిగినట్లు సూచిస్తూ సోషల్ మీడియా యూజర్లు వీడియోను షేర్ చేస్తున్నారు. (ఆర్కైవ్)
బడ్జెట్ కు సంబంధించి ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఈ రైలు ప్రమాదాలు ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందనే నిజాన్ని బయట పెడుతున్నాయని పేర్కొంటూ ఒక X వినియోగదారు ఈ వీడియోను పంచుకున్నారు.
కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్, “మరో రైలు ప్రమాదం” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పంచుకున్నారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
ఈ వీడియో 2015 నాటి రైలు ప్రమాదానికి సంబంధించినది కాబట్టి, వైరల్ అవుతున్న వాదన తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు.. జూన్ 29, 2015న NDTVలో ‘చర్చిగేట్ ప్రమాదంలో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లిన CCTV ఫుటేజీని చూడండి’ అనే శీర్షికతో వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
మోటర్‌మ్యాన్ రైలుపై నియంత్రణ కోల్పోయారు.. లోకల్ రైలుకు సమయానికి బ్రేకులు వేయలేకపోవడంతో డెడ్ ఎండ్ ను ఢీకొట్టింది. అది కాస్తా ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకెళ్లిందని తెలిపారు.
BCC న్యూస్ జూన్ 29, 2015న ‘India: Passengers leap from derailed train in Mumbai.’ అనే టైటిల్ తో వీడియోను ప్రచురించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారని, రైలు సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
హిందూస్తాన్ టైమ్స్ జూన్ 28, 2015న ఒక కథనంలో ఈ ప్రమాదాన్ని నివేదించింది. ‘ముంబయి చర్చ్‌గేట్ స్టేషన్‌లో రైలు ప్రమాదానికి గురైంది.’ అనే శీర్షికతో వార్తాపత్రిక ఐదుగురు ప్రయాణికులు గాయపడినట్లు, పశ్చిమ రైల్వే లైన్‌లో సబర్బన్ రైలు సేవలకు అంతరాయం కలిగిందని నివేదించింది.
కాబట్టి, వీడియో ఇటీవల జరిగిన ప్రమాదాన్ని చూపలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Md Mahfooz Alam