నిజమెంత: విమానం లోపల జరిగిన ఘర్షణకు సంబంధించిన వైరల్ వీడియో హైదరాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకోలేదు

విమానంలో ప్రయాణీకుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో ఈ ఘటన జరిగిందని వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు చెబుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2024 6:15 AM
Hyderabad airport, Thai Smile Airways, Fight

నిజమెంత: విమానం లోపల జరిగిన ఘర్షణకు సంబంధించిన వైరల్ వీడియో హైదరాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకోలేదు 

విమానంలో ప్రయాణీకుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో ఈ ఘటన జరిగిందని వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు చెబుతున్నారు.

ఒక

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్లైన్స్ విమానంలో గొడవ ఉద్రిక్తత. సీట్ల కోసం గొడవ పడుతున్న ప్రయాణికులు షాకు గురైన తోటి ప్రయాణికులు. pic.twitter.com/0vPAXJjVTg

— ChotaNews (@ChotaNewsTelugu) October 15, 2024
" target="_blank">X వినియోగదారు వీడియోను పోస్ట్ చేసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో ఘర్షణ, ఉద్రిక్తత నెలకొందని తెలిపారు. ఈ ఘటనతో తోటి ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారని తెలిపారు.

"శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్లైన్స్ విమానంలో గొడవ ఉద్రిక్తత. సీట్ల కోసం గొడవ పడుతున్న ప్రయాణికులు షాకు గురైన తోటి ప్రయాణికులు." అంటూ పోస్టు పెట్టారు. (ఆర్కైవ్)

51 సెకన్ల నిడివిగల వీడియోలో ప్రయాణీకులు హిందీలో వాదించుకోవడం చూడొచ్చు. తిట్టుకుంటూ తోసుకున్నారు కూడా. పరిస్థితిని సద్దుమణిగించేందుకు క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకోవడం వీడియోలో చూడవచ్చు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

ఈ వీడియో 2022లో బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో జరిగిన సంఘటనకు సంబంధించింది.

న్యూస్‌మీటర్ బృందం హైదరాబాద్ విమానాశ్రయ అధికారులతో మాట్లాడి వీడియో RGIA కు సంబంధించింది కాదని నిర్ధారించింది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. డిసెంబర్ 28, 2022 నాటి X పోస్ట్‌కి దారితీసింది, “బ్యాంకాక్, భారత్ మధ్య థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణీకుల మధ్య ఘర్షణ జరిగింది." అని ఉండడం గమనించాం. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారో ఖచ్చితంగా తెలియలేదు.

దీంతో ఆ వీడియో పాతదేనని తేలింది.

దీన్ని క్లూగా ఉపయోగించి, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికను కూడా కనుగొన్నాము, ‘Flyers fight on Thai flight to Kolkata; BCAS starts probe,’ అనే టైటిల్ తో డిసెంబర్ 30, 2022న కథనాన్ని ప్రచురించారు.

ఈ నివేదికలో వైరల్ వీడియో ఫుటేజీ కూడా ఉంది. ఈ నివేదిక ప్రకారం, బ్యాంకాక్-కోల్‌కతా విమానంలో భారత్ కు చెందిన వ్యక్తి ఇతర వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. సీటును సర్దుబాటు చేయడానికి సంబంధించి గొడవ ప్రారంభమైంది. అతనికి గుణపాఠం చెప్పడానికి ఫ్లైట్ లోని ఇతరులు జోక్యం చేసుకోవడంతో గొడవ మరింత ఎక్కువైంది.

ఈ ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సుమోటోగా దర్యాప్తు ప్రారంభించింది. కోల్‌కతాలోని విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారని నివేదిక పేర్కొంది.

'బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు విమానంలో గొడవ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు' అనే శీర్షికతో ది హిందూ - బిజినెస్ లైన్ నివేదికను డిసెంబర్ 29, 2022న ప్రచురించింది.

విమానంలోని ఒక ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 26న విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి వచ్చే ముందు ఈ సంఘటన జరిగిందని నివేదిక పేర్కొంది.

హిందుస్థాన్ టైమ్స్ ఈ ఘటనకు సంబంధించి ‘Feel sorry for this’: Thai airline's apology for ugly mid-air fight’ అనే టైటిల్ తో డిసెంబర్ 29, 2022న కథనాన్ని ప్రచురించబడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రయాణీకులకు ఎయిర్‌లైన్ సంఘటనకు సంబంధించి క్షమాపణలు చెప్పింది.

థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్‌ కు చెందిన ట్విట్టర్ ఖాతాలో “THAI స్మైల్ ఎయిర్‌వేస్ ఈ ఘటనకు చింతిస్తోంది. మేము అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమాన భద్రతా విధానాలకు కట్టుబడి ఉన్నాము. ఈ వివాదాన్ని పరిష్కరించామని పునరుద్ఘాటిస్తున్నాము. మా విమాన సిబ్బంది ఇప్పటికే ఘటనలో నష్టపోయిన వారికి సహాయాన్ని అందించారు." అని తెలిపింది.

డిసెంబర్ 29, 2022న ఎయిర్‌లైన్ ఖాతాలో X పోస్ట్‌ను కూడా కనుగొన్నాము.

ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ టుడే కూడా ఇదే సంఘటనను నివేదించాయి.

కాబట్టి, వైరల్ వీడియోలోని గొడవ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందనే వాదన అబద్ధం.

Credit: Sibahathulla Sakib

Claim Review:విమానం లోపల జరిగిన ఘర్షణకు సంబంధించిన వైరల్ వీడియో హైదరాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకోలేదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X users
Claim Fact Check:False
Next Story