నిజమెంత: బురఖా ధరించిన మహిళను వృద్ధుడు వేధించిన వైరల్ వీడియో నిజంగా జరిగినది కాదు

గడ్డం ఉన్న ఓ వ్యక్తి, మహిళను అనుచితంగా తాకినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో నిజమైన సంఘటన అని పలువురు చెబుతున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sept 2024 1:15 PM IST
NewsMeterFactCheck, Bangladesh, Scripted

నిజమెంత: బురఖా ధరించిన మహిళను వృద్ధుడు వేధించిన వైరల్ వీడియో నిజంగా జరిగినది కాదు

గడ్డం ఉన్న ఓ వ్యక్తి, మహిళను అనుచితంగా తాకినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో నిజమైన సంఘటన అని పలువురు చెబుతున్నారు.

ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేసి “వీడియోలో అసభ్యకరమైన పదాలు ఉన్నాయి కాబట్టి వాటిని మ్యూట్ చేశాం. ఇది బంగ్లాదేశ్‌లోని వీడియో. వృద్ధుని వయస్సు చూడండి. ఆ తర్వాత ఆ అమ్మాయి అతడిని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టినప్పుడు, నేను తొందరపడ్డానని, పొరపాటున తాకానని పెద్దాయన చెప్పాడు. (ఆర్కైవ్)" అంటూ పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. వీడియో స్క్రిప్ట్ ను ఎడిట్ చేశారు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. అజీజుల్ 2.0 అనే Facebook ఖాతా సెప్టెంబర్ 11, 2024న వీడియోను పోస్ట్ చేసినట్లు మేము కనుగొన్నాము. అయితే ఆ పోస్ట్‌లో ఎలాంటి వివరాలు లేవు.

సెప్టెంబరు 12న పోస్ట్ చేసిన మరో వీడియోలో కూడా అలాంటి ఒకే రకమైన దుస్తులను ధరించి, అదే గడ్డం ఉన్న వ్యక్తి, బురఖా ధరించిన మహిళ ఉన్న మరో వీడియోను కూడా మేము ఖాతాలో కనుగొన్నాము. పోస్ట్ శీర్షిక ప్రకారం, వీడియోలో గడ్డం ఉన్న వ్యక్తిని వీడియోలో నటించడం కోసం తీసుకున్నట్లు తెలిపారు.

మేము ఖాతాను నిశితంగా పరిశీలించాం. అనేక వీడియోలలో గడ్డం ఉన్న వ్యక్తిని గుర్తించాము. ఈ ఖాతాలో స్క్రిప్ట్ తో కూడుకున్న వీడియోలను పోస్ట్ చేస్తుందని నిర్ధారించాము.

సంబంధిత అకౌంట్ లో పలు వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్ చేసి వీక్షించవచ్చు.

ఖాతా వెనుక ఉన్న వినియోగదారు అజీజుల్ హక్ మోరాద్ అని కూడా మేము కనుగొన్నాము. అతను బంగ్లాదేశ్‌లో తన పేరుతో ఖాతాను నిర్వహిస్తున్నాడు. అతని ఖాతా బయో ప్రకారం, అతను వీడియో సృష్టికర్త. అదే గడ్డం ఉన్న వ్యక్తి నటించిన అనేక వీడియోలను కూడా మేము కనుగొన్నాం. వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్‌ చేసి వీక్షించవచ్చు.

న్యూస్‌మీటర్ వైరల్ వీడియోతో పాటు సోషల్ మీడియాలో అతను పంచుకునే ఇతర కంటెంట్‌కు సంబంధించి స్పష్టత కోసం అజీజుల్ హక్ మోరాద్ ను సంప్రదించింది. అతను స్పందించిన వెంటనే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.

అందువల్ల, వైరల్ వీడియోలో ఉన్నది నటీనటులని స్పష్టంగా తెలుస్తోంది. ముస్లిం మహిళను ఓ ముసలాయన వేధించిన వీడియో కాదని స్పష్టంగా తెలుస్తోంది.

Credit: Md Mahfooz Alam

Claim Review:బురఖా ధరించిన మహిళను వృద్ధుడు వేధించిన వైరల్ వీడియో నిజంగా జరిగినది కాదు.
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story