నిజమెంత: ఇరాన్‌లో నిరసనలకు సంబంధించిన పాత వీడియోను ఇటీవలి సంఘటనగా ప్రచారం చేస్తున్నారా?
ఇరాన్-మద్దతు ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు నివేదికలు వచ్చిన తర్వాత, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2024 1:45 PM ISTనిజమెంత: ఇరాన్‌లో నిరసనలకు సంబంధించిన పాత వీడియోను ఇటీవలి సంఘటనగా ప్రచారం చేస్తున్నారా?
ఇరాన్-మద్దతు ఉన్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు నివేదికలు వచ్చిన తర్వాత, ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నట్లు చూపించే వీడియో వైరల్‌గా మారింది.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను “ఇరాన్ లో తిరుగుబాటు ప్రారంభమైంది. ఇరాన్‌లోని ఇస్లామిక్ నియంతృత్వం అణచివేత ధోరణిలో భాగమైన సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు తమను తాము రక్షించుకుంటున్నారు." అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు.
ఎనిమిది సెకన్ల క్లిప్‌లో నిరసనకారుల గుంపు భద్రతా వాహనంపై వస్తువులను విసిరినట్లు చూపిస్తుంది, అది దాడిలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగింది.
ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో పాతది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోని X ఖాతాలో సెప్టెంబర్ 21, 2022 నాటి పోస్ట్‌గా గుర్తించాం. క్యాప్షన్ లో “Wow. Just wow. Protesters beat back regime forces in Amol, #Iran. #IranProtests #MahsaAmini,” అని ఉంది. ఇరాన్‌లోని అమోల్‌లో నిరసనకారులు రక్షణ బలగాలపై ఎదురు తిరిగారని అందులో ఉంది. #MahsaAmini అనే హ్యాష్ ట్యాగ్ ఈ ఫుటేజ్ మహ్సా అమినీ మరణం తర్వాత జరిగిన నిరసనల నుండి వచ్చినదని సూచిస్తుంది.
Wow. Just wow. Protesters beat back regime forces in Amol, #Iran.#IranProtests #MahsaAmini #مهساامینی #مهسا_امینی pic.twitter.com/plGbOTj2HR
— Alireza Nader علیرضا نادر (@AlirezaNader) September 21, 2022
ఈ వీడియో పాతదని, మహ్సా అమిని మరణానికి సంబంధించినదని సూచించింది. 2022లో పోలీసు కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమిని మరణించింది. హిజాబ్ ధరించాలనే నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. ఆమె మరణం దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనంతగా నిరసనలకు దారితీసిందని BBC నివేదించింది.
కీవర్డ్ సెర్చ్‌ల ద్వారా తదుపరి విచారణ చేయగా సెప్టెంబర్ 22, 2022 నాటి ఇండిపెండెంట్ టీవీ నివేదికను మేము కనుగొన్నాం. “Protesters rush towards police car in Amol as Iran demonstrations continue,” అనే శీర్షికతో అదే వీడియోను వైరల్ చేశారు. ఇరాన్ లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని ఆ సమయంలో నిరసనకారులు అమోల్‌లోని పోలీసు కారు వైపు దూసుకుపోయారని ఆ కథనంలో ఉంది.
నివేదిక ప్రకారం, 22 ఏళ్ల మహ్సా అమిని మరణంతో నిరసనలు చెలరేగాయి. ఇరాన్ నైతికత పోలీసులు హిజాబ్ అంశంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గుండెపోటుతో మరణించిందని అధికారిక ప్రకటనలు వచ్చినా, ఆమె కుటుంబం మాత్రం పోలీసులే చంపేశారని ఆరోపించారు. ఇది దేశ వ్యాప్తంగా విస్తృతమైన ప్రదర్శనలకు దారితీసింది.
The Washington Post మీడియా సంస్థ ‘Anger against Iran’s ‘morality police’ erupts after death of Mahsa Amini’ అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించింది.
అమిని మరణం, నిరసనలు, ఆ నిరసనలను పాలకులు ఎలా అణచివేశారనే అంశాలను ఈ నివేదిక వివరించింది.
అందువల్ల, ఇరాన్‌లో ఇటీవలి నిరసనలను ఈ వీడియో చూపుతుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఫుటేజ్ 2022 లో మహ్సా అమినీ మరణం తర్వాత వచ్చిన నిరసనలకు సంబంధించింది. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా చేసిన నిరసనలు కావు.
Credit: Sibahathulla Sakib