నిజమెంత: ఉజ్జయినిలో హిందూ వ్యతిరేక నినాదాలు ముస్లింలు చేయలేదు

మార్చి 31న భారతదేశంలో ముస్లింలు ఈద్ జరుపుకున్నారు. భారీ జనసమూహం రోడ్డుపై గుమిగూడి నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 7 April 2025 3:06 PM IST

NewsMeterFactCheck, Muslims, Ujjain, Israel

నిజమెంత: ఉజ్జయినిలో హిందూ వ్యతిరేక నినాదాలు ముస్లింలు చేయలేదు 

మార్చి 31న భారతదేశంలో ముస్లింలు ఈద్ జరుపుకున్నారు. భారీ జనసమూహం రోడ్డుపై గుమిగూడి నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న యూజర్లు ఈద్ రోజున, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో హిందువులపై దాడులు చేయాలంటూ ముస్లింలు నినాదాలు చేశారని తెలిపారు.

వీడియోను షేర్ చేస్తూ, ఒక ఎక్స్ యూజర్ ఇలా వ్రాశాడు, “ఉన్హెల్, ఉజ్జయిని: ఈద్ రోజున హిందువుల నాశనం కోసం ముస్లింలు ప్రార్థిస్తున్నారు! ఈద్ రోజున, వారు ప్రార్థన చేస్తున్నారు - ‘హిందూ బర్బాద్ హోగా (హిందువులు నాశనం అవుతారు), ఇన్షా అల్లా, ఇన్షా అల్లా. ఇది రహస్యంగా కాదు, బహిరంగంగా ఒక ఆలయం దగ్గర రోడ్డుపై నిలబడి చెబుతున్నది." అంటూ ఆ పోస్టులో తెలిపారు. (ఆర్కైవ్)

పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే తరహా పోస్టులను వైరల్ చేశారు

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈద్ సందర్భంగా హిందూ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఎటువంటి నివేదికలు లేవు. వీడియో ఏప్రిల్ 2024 నాటిది.

వైరల్ వీడియోను మేము నిశితంగా పరిశీలించాం. అందులో చేస్తున్న నినాదాలు ‘ఇజ్రాయెల్ తు బర్బాద్ హోగా’ (ఇజ్రాయెల్, మీరు నాశనం అవుతారు), ఆ తర్వాత ‘ఇన్షా అల్లాహ్, ఇన్షా అల్లా’ అని చెప్పినట్లు కనుగొన్నాము. వైరల్ వీడియోలో కూడా ఈ నినాదం స్పష్టంగా వినిపిస్తోంది.

మేము వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము. ఏప్రిల్ 12, 2024న పంజాబ్ కేసరి మధ్యప్రదేశ్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను అప్లోడ్ చేశారు. ఉజ్జయినిలో ఇజ్రాయెల్ నాశనం అవుతుందంటూ ముస్లింల బృందం నినాదాలు చేసిందని ఛానెల్ తెలిపింది. ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు స్పష్టంగా వినిపిస్తున్నట్లు వీడియోను ద్వారా ధృవీకరించాము.

మరో యూట్యూబ్ ఛానల్ 'స్వదేశ్ న్యూస్ డిజిటల్' ఏప్రిల్ 12, 2024న ఈ వీడియోను ప్రచురించింది. ఉజ్జయినిలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు లేవనెత్తారని నివేదించారు.

ఏప్రిల్ 2024లో దైనిక్ భాస్కర్, ETV మధ్యప్రదేశ్ నివేదించిన వీడియోలను కూడా మేము కనుగొన్నాము. ఉజ్జయిని జిల్లాలోని ఉన్హెల్ లో రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని, అందులో ముస్లిం సమాజ సభ్యులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నట్లు నివేదించాయి.

ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ వీడియోపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. హిందూ సంస్థలు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు లేఖను సమర్పించాయని మీడియా సంస్థలు నివేదించాయి.

ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాల వెనుక కారణం:

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్నప్పటి నుండి, ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ భారతదేశంలోని అనేక నగరాల్లో వివిధ ముస్లిం గ్రూపులు, సంస్థలు నిరసనలు చేపట్టాయి.

కాబట్టి, వైరల్ వీడియోలో ఈద్ సందర్భంగా ఉజ్జయినిలో హిందూ వ్యతిరేక నినాదాలు చేశారనే వాదనలో నిజం లేదని మేము నిర్ధారించాము.

Credit: Mahfooz Alam

Next Story