నిజమెంత: LTTE చీఫ్ వీ. ప్రభాకరన్ వైరల్ వీడియోను AI ద్వారా రూపొందించారు
LTTE చీఫ్ ప్రభాకరన్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Sept 2024 4:30 PM ISTనిజమెంత: LTTE చీఫ్ వీ. ప్రభాకరన్ వైరల్ వీడియోను AI ద్వారా రూపొందించారు
శ్రీలంక ప్రభుత్వం తమిళుల హక్కులను అణచివేసినప్పుడు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) చీఫ్ వేలు పిళ్లై ప్రభాకరన్ చేసిన పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పోరాటంలో చివరికి ప్రభాకరన్ ప్రాణాలు వదిలారని అంటారు. అయితే ఆయన బ్రతికే ఉన్నారని నమ్మే వర్గం కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రభాకర్ భారతదేశంలో తలదాచుకుంటూ ఉన్నారని పలువురు గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం అయ్యాయి. ఇప్పుడు ప్రభాకరన్ కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.
ఆ వైరల్ వీడియో ఎంత వరకూ నిజం అని సోషల్ మీడియా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోలో, ప్రభాకరన్ “నా ప్రియమైన, గౌరవనీయమైన తమిళ ఈలం ప్రజలారా, సింహళ ప్రభుత్వం మా హక్కులను అణచివేసినందుకు మేము ఆయుధాలతో యుద్ధం చేయవలసి వచ్చింది. మేము ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు, కానీ మా హక్కుల రక్షణలో మేము గట్టిగా నిలబడ్డాము. అనేక సందర్భాల్లో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నప్పటికీ, మా పోరాటాలు 2009లో మహీందా సింహళ ప్రభుత్వం నేతృత్వంలోని ప్రపంచ సామ్రాజ్యవాద శక్తుల సహాయంతో క్రూరంగా అణచివేశారు. మా పోరాటంలో అనేక ద్రోహాలను ఎదుర్కొన్నాం, అయినప్పటికీ మేము ఎల్లప్పుడూ వాటిని అధిగమించాము. ఈరోజు మీ ముందు నిలిచే ద్రోహులను ఓడించాలి, మన వీరులు, సామాన్య ప్రజల త్యాగాలను గౌరవించాలి. తమిళులుగా ఐక్యమై ఈ శక్తులను ఓడించండి. టైగర్ల అంతిమ లక్ష్యం తమిళ ఈలం మాతృత్వం, ”అని అందులో చెప్పడం మనం వినవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారని న్యూస్‌మీటర్ కనుగొంది. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించారు.
2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ఎల్‌టీటీఈ నాయకుడు వి ప్రభాకరన్ మరణించారు. కానీ, ఆయన ఇంకా బతికే ఉన్నాడని కొన్ని తమిళ జాతీయవాద సంస్థలు, నాయకులు చెబుతుంటారు. అనేక కుట్ర సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి.
వీడియోను నిశితంగా పరిశీలించిన తర్వాత, ప్రభాకరన్ తల మాత్రమే కదులుతున్నట్లు స్పష్టమవుతుంది. అయితే మిగిలిన శరీరం స్థిరంగా ఉంది. ఈ సాక్ష్యాలు వీడియోను AI ద్వారా రూపొందించారని సూచిస్తుంది.
డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ (DAU), మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలియన్స్ (MCA) లో న్యూస్‌మీటర్ కూడా భాగమే. ఈ వీడియోను మా బృందం విశ్లేషించింది.
ఆడియో ట్రాక్‌ను నిశితంగా పరిశీలించడానికి డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్ Loccus.aiని ఉపయోగించారు. ఈ సాధనం ఆడియో ప్రామాణికతను గుర్తించడానికి కాన్ఫిడెన్స్ స్కోర్‌ను కేటాయిస్తుంది. 1.0కి దగ్గరగా ఉన్న స్కోర్‌లు నిజమైన ఆడియోను సూచిస్తాయి. 0.0కి సమీపంలో ఉన్న స్కోర్‌లు AI ద్వారా తయారు చేశారనే విషయాన్ని సూచిస్తాయి. ఈ వైరల్ వీడియో విషయంలో విశ్లేషణ 0.253 స్కోర్ ను చూశాం. దీన్ని బట్టి వైరల్ వీడియో లోని ఆడియో AI ద్వారా ఉత్పత్తి చేశారని సూచిస్తోంది.
TrueMediaతో రెండవ విశ్లేషణ చేశాము. ముఖం, ఆడియో రెండూ AIతో తయారు చేశారని నిర్ధారించాం.
హైవ్ AI టూల్ ని ఉపయోగించి కూడా వీడియోను పరిశీలించారు.
హైవ్ విజువల్ డిటెక్షన్ టూల్ వీడియోను మానిప్యులేషన్ చేశారని గుర్తించింది. ఈ టూల్ ఆడియో విశ్లేషణ సాధనం సౌండ్ ట్రాక్‌ను 10-సెకన్ల క్లిప్‌లుగా విభజించి, ప్రతి విభాగాన్ని విడివిడిగా విశ్లేషిస్తుంది. ఈ సాధనం ఆడియో క్లిప్‌లలో ఎక్కువ భాగం AI ద్వారా తయారు చేశారని గుర్తించింది. అయితే కొన్ని సెకండ్స్ ఆడియో మాత్రం 'AI కాదు' అని తెలిపింది.
Loccus.ai, TrueMedia, Hive లాంటి సాధనాల నుండి వచ్చిన ఫలితాలను బట్టి వీడియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారని తేల్చేశాం.
వైరల్ వీడియోలో ఉన్నది అసలు రికార్డింగ్ కాదని స్పష్టమైంది.