నిజమెంత: జియో హొలీ ఆఫర్ అంటూ 700 రూపాయలు లభిస్తూ ఉందా?
దేశవ్యాప్తంగా చాలా మంది హోలీని ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలోనే పలు కంపెనీలు కూడా డిస్కౌంట్లు, రివార్డులను అందించడం ద్వారా ప్రజలను ఆకర్షించాయి. అలాంటి ఒక ప్రమోషనల్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2025 12:42 PM IST
నిజమెంత: జియో హొలీ ఆఫర్ అంటూ 700 రూపాయలు లభిస్తూ ఉందా?
దేశవ్యాప్తంగా చాలా మంది హోలీని ఉత్సాహంగా గడిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. రంగుల పండుగకు సంబంధించిన ఉత్సాహభరితమైన వేడుకలు కేవలం ప్రజల వరకూ మాత్రమే పరిమితం కాలేదు. పలు కంపెనీలు కూడా డిస్కౌంట్లు, రివార్డులను అందించడం ద్వారా ప్రజలను ఆకర్షించాయి. అలాంటి ఒక ప్రమోషనల్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాలుగు ఫేస్‌బుక్ పోస్ట్‌లలో 15.3 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది.
జియో కస్టమర్లు బహుమతిగా రూ. 700 పొందవచ్చని ఆ ఆఫర్ పోస్టర్ లో ఉంది. మార్చి 12న ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ప్రమోషనల్ ఆఫర్ వీడియోలలో ఈ వాదన ఉంది.
ఈ వీడియోలో జియోకు నాయకత్వం వహించే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిత్రం, జియో డిజిటల్ లైఫ్, జియో సినిమా లోగోలు ఉన్నాయి. “హోలీ సందర్భంగా, అందరు జియో కస్టమర్లు రూ. 700 రివార్డ్ పొందవచ్చు. మీ బ్యాంకు (ఖాతా)కి త్వరగా డబ్బు పంపడానికి దయచేసి క్లిక్ చేయండి.” అంటూ అందులో ఉంది. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్ కు సంబంధించిన మరో మూడు ఫేస్‌బుక్ వీడియోల ఆర్కైవ్డ్ వెర్షన్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ లో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ప్రమోషనల్ ఆఫర్ ఒక స్కామ్. జియో తన కస్టమర్లకు హోలీ సందర్భంగా రూ.700 రివార్డ్ అందించే ఎటువంటి ఆఫర్‌ను కూడా జారీ చేయలేదు.
జియో అధికారిక వెబ్‌సైట్‌లో, కస్టమర్లు హోలీకి రూ.700 రివార్డ్ పొందవచ్చని పేర్కొన్న ఏ ఆఫర్ లేదా ప్రమోషన్‌ను మేము కనుగొనలేదు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా జియో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా హోలీ ప్రమోషనల్ ఆఫర్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు.
మెటా ప్లాట్‌ఫామ్‌లలోని అన్ని యాక్టివ్ ప్రకటనలను శోధించి వీక్షించగల మెటా యాడ్ లైబ్రరీ, కంపెనీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎటువంటి హోలీ ప్రమోషనల్ ఆఫర్‌లను మేము చూడలేదు.
మేము వైరల్ ప్రమోషనల్ ఆఫర్‌లపై క్లిక్ చేసాము. ‘festivvholiiioff.xyz’ అనే URL ఉన్న వెబ్‌సైట్‌కు వెళ్ళింది. అయితే, జియో అధికారిక వెబ్‌సైట్ URL ‘jio.com’.. కాబట్టి ఇది అధికారిక సైట్ కాదు. వెబ్‌సైట్ యొక్క ఆర్కైవ్‌ను ఇక్కడ చూడవచ్చు.
వెబ్‌సైట్‌లో, జియోకు సంబంధించిన ఎటువంటి ప్రమోషనల్ ఆఫర్‌ను మేము చూడలేదు. వెబ్‌సైట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రం, ‘డిజిటల్ ఇండియా’ లోగో “‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఖాతాలో 1999 రూపాయలను ఉచితంగా పొందవచ్చు. దీన్ని మీ ఖాతాకు పంపడానికి, క్రింద స్క్రాచ్ చేయండి” అని పేర్కొన్న డిజిటల్ స్క్రాచ్ కార్డ్ చిత్రం ఉంది. (హిందీ నుండి అనువదించబడింది)
“ప్రతి భారతీయ పౌరుడు ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద వారి ఖాతాలో రూ. 1,999 వరకు బహుమతిని పొందుతారు” అని వెబ్‌సైట్‌లో ఉంది.
ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ సంస్థలకు రుణాలు అందించడానికి ఏప్రిల్ 8, 2015న ప్రధాన మంత్రి ప్రారంభించిన పథకం.
ఈ పథకం వెబ్‌సైట్‌లో పౌరులందరికీ రూ. 1,999 రివార్డుకు సంబంధించిన సమాచారం లేదు. దీనికి సంబంధించి ఎటువంటి వార్తా నివేదికలు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు లేవని కూడా మేము కనుగొన్నాము.
దీని ప్రకారం రూ. 700 జియో హోలీ ఆఫర్ క్లెయిమ్, రూ. 1,999 ముద్ర యోజన క్లెయిమ్ రెండూ నిజం కాదని స్పష్టంగా తెలుస్తోంది. సులభంగా డబ్బు వస్తాయని చెబుతూ, నెటిజన్లను తప్పుదారి పట్టించడానికి చేస్తున్న మోసాలు.
‘festivvholiiioff.xyz’ వెబ్‌సైట్ URL ప్రామాణికతను తనిఖీ చేయడానికి మేము స్కామ్ అడ్వైజర్‌ను ఉపయోగించాము. ఇది అనుమానాస్పద వెబ్‌సైట్ అని తేలింది. స్కామ్ అడ్వైజర్ ఈ వైరల్ పోస్టులోని లింక్ ద్వారా ఓపెన్ అయిన వెబ్‌సైట్ స్కామ్ కావచ్చని గుర్తించింది.
కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ ప్రమోషనల్ ఆఫర్ క్లెయిమ్ లో ఎలాంటి నిజం లేదని తేల్చింది. జియో హోలీ ప్రమోషనల్ ఆఫర్ కస్టమర్లకు రూ. 700 రివార్డ్ ఇవ్వడం లేదు. ఇది ఒక స్కామ్.
Credit: K Sherly Sharon