నిజమెంత: డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు చనిపోలేదు
ఇజ్రాయెల్ తన ఆపరేషన్ లో అక్టోబర్ 7 దాడుల వెనుక సూత్రధారిగా ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్‌ను అంతం చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: డ్రోన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు చనిపోలేదు
ఇజ్రాయెల్ తన ఆపరేషన్ లో అక్టోబర్ 7 దాడుల వెనుక సూత్రధారిగా ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్‌ను అంతం చేసింది. వెంటనే, హిజ్బుల్లా గ్రూపులు ప్రతీకారచర్యగా శనివారం ఇజ్రాయెల్‌లోని సిజేరియాలో ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై డ్రోన్ దాడిని ప్రారంభించింది.
ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు యైర్ నెతన్యాహు హత్యకు గురయ్యారని పేర్కొంటూ ఆయన చిత్రాలను షేర్ చేయడం ప్రారంభించారు.
ఒక X వినియోగదారు యైర్ నెతన్యాహు, అతని తండ్రి బెంజమిన్ నెతన్యాహు చిత్రాన్ని పంచుకున్నారు. “సిజేరియాలో నెతన్యాహు చిన్న కుమారుడు యైర్ హత్యను ధృవీకరించారు. (sic)” అంటూ పోస్టు పెట్టారు.
పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ఉన్నాయి. (ఆర్కైవ్), (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
అసలు నిజాలను తెలుసుకోడానికి సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా అక్టోబర్ 20, 2024 నాటి బీబీసీ కథనాన్ని మేము కనుగొన్నాం. ‘Netanyahu says he is undeterred after reported drone attack on his home’, అనే శీర్షికతో BBC ఒక నివేదికను ప్రచురించింది. తనకు ఏమీ అవ్వలేదని నెతన్యాహు చెప్పారని ఈ కథనం నివేదించింది.
నివేదిక ప్రకారం, శనివారం ఉదయం తీరప్రాంత పట్టణమైన సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని ప్రైవేట్ నివాసాన్ని లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఆ సమయంలో నెతన్యాహు లేదా అతని భార్య అక్కడ లేరు, ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కు చెందిన మరొక నివేదికను మేము కనుగొన్నాము. 'నెతన్యాహు ఇంటిపై హిజ్బుల్లా దాడి చేసింది' అని అక్టోబర్ 20, 2024న కథనం చూశాం. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆ నివేదిక ప్రకారం, శనివారం ఉదయం లెబనాన్ నుండి మూడు డ్రోన్‌లు ప్రధానమంత్రి ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. వాటిలో రెండు డ్రోన్ లను రోష్ హనిక్రా, నహరియా సమీపంలో అడ్డుకోగలిగారు. మూడవది విలాసవంతమైన గృహాలు, పురాతన రోమన్ అవశేషాలకు ప్రసిద్ధి చెందిన తీరప్రాంత పట్టణమైన సిజేరియాలో పేలింది. ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య నివాసానికి దూరంగా ఉన్నారు.
ఇండియా టీవీ, మింట్, ఇండియా టుడే రిపోర్ట్‌లలో ఇలాంటి అప్‌డేట్‌లను మేము కనుగొన్నాము. ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణనష్టం గురించి ప్రస్తావించలేదు.
ఇంకా, మేము Yair Netanyahu సోషల్ మీడియా హ్యాండిల్‌లను తనిఖీ చేసాము. అతని ఆన్‌లైన్ వివరాలను కూడా విశ్లేషించాము. Yair Netanyahu ఖాతా Xలో యాక్టివ్‌గా ఉందని కూడా మేము కనుగొన్నాము. అక్టోబర్ 21న కూడా పోస్టు చేశారు. హిజ్బుల్లా నాయకుడి ఇంటర్వ్యూను రీపోస్ట్ చేసినట్లు గుర్తించాం.
మేము Yair కు సంబంధించి Instagram ఖాతాను కూడా కనుగొన్నాము. అతని చివరి పోస్ట్ అక్టోబర్ 7న ఉన్నప్పటికీ, స్టేటస్ ను కొన్ని గంటల క్రితం కూడా పంచుకున్నాడు. మేము Yair Facebook ఖాతాను తనిఖీ చేసాము.
సిజేరియాలోని ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై హిజ్బుల్లా డ్రోన్ దాడి చేయడంతో బెంజమిన్ కుమారుడు యైర్ నెతన్యాహు చనిపోయాడనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit: Sibahathulla Sakib