సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో.. గడ్డం ఉన్న వ్యక్తి ఓ కార్యాలయంలో ఇస్లామిక్ ప్రార్థనను చదువుతున్నట్లు చూపిస్తుంది. మరికొందరు అతడు చదువుతూ ఉండగా కెమెరాల్లో బంధించారు. ఢాకా యూనివర్శిటీలోని ఒక హిందూ ప్రొఫెసర్ తో బలవంతంగా ఖురాన్ ను పఠించేలా చేశారని, జమాత్-ఇ-ఇస్లామీ విద్యార్థి సంస్థ సభ్యులు బలవంతంగా రాజీనామా చేయించారని పోస్టుల్లో తెలిపారు.
ఒక X వినియోగదారు వీడియోను షేర్ చేస్తూ.. “ఢాకా కాలేజీకి చెందిన ఒక హిందూ ప్రొఫెసర్ రాజీనామాను జమాత్-ఇ-ఇస్లామీ విద్యార్థి సంస్థ చాలా విచిత్రమైన రీతిలో తీసుకుంది. మొదట, హిందూ ప్రొఫెసర్‌ను ఖురాన్‌ను పఠించేలా చేశారు, తరువాత అతని రాజీనామా తీసుకున్నారు." (హిందీ నుండి అనువదించారు) (ఆర్కైవ్) అంటూ పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
ఢాకా యూనివర్శిటీలో హిందూ ప్రొఫెసర్ తో బలవంతంగా రాజీనామా చేయించినట్లు వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా న్యూస్ మీటర్ గుర్తించింది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించగా.. ఢాకా పోస్ట్ అనే ధృవీకరించిన YouTube ఛానెల్ ద్వారా ఆగస్టు 19న ఈ వీడియో ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. ఛానెల్ ప్రకారం.. ఢాకా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ అబ్దుల్ బషీర్‌ను రాజీనామా చేయమని బలవంతం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ పఠించిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న అబ్దుల్ బషీర్ తో రాజీనామా చేయించారు.
ఆగస్టు 19న ఢాకా ట్రిబ్యూన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ప్రొఫెసర్ బషీర్‌ను డియు విద్యార్థులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వాదనకు దిగారు. గతంలో రంజాన్ సందర్భంగా క్యాంపస్‌లో ఖురాన్ పఠన కార్యక్రమంలో పాల్గొన్న వారిని శిక్షించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అతని రాజీనామా తర్వాత, పవిత్ర ఖురాన్ నుండి పఠనం జరిగింది.
టైమ్స్ నౌతో సహా అనేక ఇతర మీడియా సంస్థలు కూడా ప్రొఫెసర్ బషీర్ బలవంతపు రాజీనామాను నివేదించాయి.
అందువల్ల, బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ప్రొఫెసర్ బలవంతంగా రాజీనామా చేయడాన్ని ఈ వీడియోలో చూపించలేదని మేము నిర్ధారించాము.
Credit: Md Mahfooz Alam