నిజమెంత: 2007లో ప్రపంచ కప్ గెలిచిన జట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి ఫోటో తీసుకోలేదా?

ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని 2007 టీ20 ప్రపంచ కప్ విజేత జట్టుతో కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 July 2024 12:00 PM GMT
NewsMeterFactCheck,Manmohan Singh, Soniagandhi

నిజమెంత: 2007లో ప్రపంచ కప్ గెలిచిన జట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి ఫోటో తీసుకోలేదా? 

జూన్ 30న బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి, రోహిత్ శర్మ నాయకత్వంలో భారత మెన్స్ క్రికెట్ జట్టు.. రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో MS ధోని నేతృత్వంలోని 2007 T20 ప్రపంచ కప్ విజేత జట్టుతో కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఫోటోలో కాంగ్రెస్ నాయకురాలు, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. గెలుపొందిన జట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బదులుగా సోనియా గాంధీతో ఫోటో తీయించుకున్నారనే వాదనతో పోస్టును వైరల్ చేస్తున్నారు.

ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని పంచుకున్నారు. “భారత క్రికెట్ జట్టు 2007లో ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ మరియు రాజీవ్ శుక్లా BCCI తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు, దేశ ప్రధాన మంత్రి అయిన మన్మోహన్ సింగ్‌కు బదులుగా.. 'సూపర్ పీఎం' సోనియా గాంధీతో ఫోటో షూట్ చేశారు. భారత క్రికెట్ జట్టుతో ఫోటోషూట్ చేయడానికి సోనియా గాంధీకి ఉన్న అర్హత ఏమిటని ఏ పాత్రికేయుడు కూడా ప్రశ్నించలేదు. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎంత నియంతృత్వాన్ని ప్రదర్శించిందో, ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని ఎంతగా తగ్గించిందో ఒక్కసారి ఆలోచించండి." అంటూ పోస్టు పెట్టారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

సోనియా గాంధీతో పాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా 2007 T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో ఫోటోలు తీసుకున్నారు.

మేము నిర్దిష్ట కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. మన్మోహన్ సింగ్ భారత జట్టుతో సమావేశమై, పోజులిచ్చిన ఆరు ఫోటోలను అక్టోబర్ 31, 2027న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఈ ఫోటోలలో ఒకటి మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్, ఇతర ప్రముఖులు సమూహం కలిసి తీసుకున్న ఫోటోను చూడొచ్చు.

“Prime Minister Manmohan Singh, his wife Gursharan Kaur, and other dignitaries pose for a group photograph with T20 World Cup winners.” అంటూ ఫోటోగ్రాఫ్ క్యాప్షన్ ను మనం చూడొచ్చు.

అక్టోబరు 30, 2007న PMO ఆర్కైవ్‌లో అప్లోడ్ చేసిన మూడు ఫోటోలను కూడా కనుగొన్నాము. మొదటి ఫోటోలో మన్మోహన్ సింగ్, ఆయన భార్య భారత జట్టుతో పోజులివ్వడం, రెండవది మన్మోహన్ సింగ్ దంపతులు అప్పటి క్రీడా మంత్రి మణిశంకర్ అయ్యర్‌తో కలిసి అప్పటి భారత జట్టు కెప్టెన్ MS ధోనితో కలిసి పోజులివ్వడం చూడొచ్చు. ధోనీ, యువరాజ్ సింగ్‌తో మన్మోహన్ సింగ్ కరచాలనం చేస్తున్న ఫోటోను కూడా మేము చూశాం.

అందువల్ల, 2007 T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో కేవలం సోనియా గాంధీ మాత్రమే ఫోటో తీసుకున్నారని.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఫోటో తీయలేదంటూ వైరల్ అవుతున్న పోస్టులు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మేము నిర్ధారించాము.

Credit: Md Mahfooz Alam

Claim Review:2007లో ప్రపంచ కప్ గెలిచిన జట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి ఫోటో తీసుకోలేదా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story