నిజమెంత: కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా టేలర్ స్విఫ్ట్ 150 మిలియన్ డాలర్లను కోల్పోయిందా?

కమలా హారిస్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చ జరిగిన తరువాత పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది.

By అంజి  Published on  19 Sept 2024 1:15 PM IST
Fake news, Taylor Swift, US Electoral campaign

నిజమెంత: కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా టేలర్ స్విఫ్ట్ 150 మిలియన్ డాలర్లను కోల్పోయిందా?

కమలా హారిస్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చ జరిగిన తరువాత పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించింది.

సోషల్ మీడియా పోస్ట్‌లో టేలర్ స్విఫ్ట్ కమలా హారిస్ కు మద్దతు తెలిపారు. “నేను 2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, టిమ్ వాల్జ్‌లకు నా ఓటు వేస్తాను. కమలాహారిస్‌కి ఓటు వేస్తున్నాను ఎందుకంటే ఆమె హక్కుల కోసం పోరాడుతుంది" అంటూ పోస్టు పెట్టారు టేలర్ స్విఫ్ట్.

కమలా హారిస్ కు టేలర్ స్విఫ్ట్ మద్దతు పలికిన తర్వాత ఆమె భారీగా ఆదాయాన్ని కోల్పోయిందంటూ కొందరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

టేలర్ స్విఫ్ట్ 150 మిలియన్ US డాలర్లను కోల్పోయిందని ఆరోపిస్తూ Xలో ఒక వాదన కనిపించింది. ప్రజలు ఆమె వస్తువులు, అనుబంధ వ్యాపారాలను బహిష్కరించారని ఆ పోస్టులో ఉంది.“Go Woke Go Broke! Taylor Swift has lost an estimated 150 million dollars over the boycotting of her merchandise and memorabilia after she endorsed Kamala Harris for President.” అంటూ ఆ ట్వీట్ లో ఉంది. (ఆర్కైవ్)

పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో పోస్టులను వైరల్ చేశారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.

టేలర్ స్విఫ్ట్, కమలా హారిస్ ఫోటోలతో కూడిన ఫేస్‌బుక్ పోస్ట్‌ కేవలం ఒక సెటైర్ అని కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు కనుగొన్నాం. “టేలర్ స్విఫ్ట్ బిగ్ ఎండోర్స్‌మెంట్ తర్వాత $125 మిలియన్ల విలువైన బ్రాండ్ డీల్స్‌ను కోల్పోయింది- ఇది సెటైర్” అంటూ తెలిపారు.

తదుపరి శోధనలో సెప్టెంబర్ 12, 2024న 'టేలర్ స్విఫ్ట్ $125 మిలియన్ల విలువైన బ్రాండ్ డీల్స్‌ను కోల్పోయింది' అనే శీర్షికతో ఎస్పాట్స్ నివేదిక కనిపించింది.

టేలర్ స్విఫ్ట్ ఇటీవల బ్రాండ్ డీల్స్‌లో 125 మిలియన్ US డాలర్లను కోల్పోయిందని, అయితే వీగన్ క్రిప్టోకరెన్సీని ఆమె ఆమోదించిన తర్వాత ఇది జరిగిందని పేర్కొంది. అయితే కథనం చివర్లో “గమనిక: ఇది వ్యంగ్యం, నిజం కాదు” అని ఉంది.

ఇక, కమలా హారిస్ కు మద్దతు ఇచ్చిన ఫలితంగా స్విఫ్ట్‌కు ఎలాంటి ఆర్థిక నష్టాలు జరగలేదని విశ్వసనీయ వార్తా సంస్థల నుండి ఎలాంటి నివేదికలు రాలేదు.

అందువల్ల, కమలా హారిస్‌కు టేలర్ స్విఫ్ట్ మద్దతు తెలపడం వల్ల 150 మిలియన్ US డాలర్లను కోల్పోయారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వైరల్ పోస్టులు వ్యంగ్య కథనాలకు సంబంధించింది. వైరల్ పోస్టులకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Credit: Sibahathulla Sakib

Claim Review:కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా టేలర్ స్విఫ్ట్ 150 మిలియన్ డాలర్లను కోల్పోయిందా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X users
Claim Fact Check:False
Next Story