నిజమెంత: సింగర్ సోనూ నిగమ్ కన్నడ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయొద్దని చెప్పారా?

ఏప్రిల్ 25న బెంగళూరులో జరిగిన ఒక కాన్సర్ట్ లో కన్నడ పాటలు పాడాలంటూ కొందరు సింగర్ సోనూ నిగమ్ తో దూకుడుగా వ్యవహరించారు.

By అంజి
Published on : 26 May 2025 2:15 PM IST

NewsMeterFactCheck, singer Sonu Nigam, MP Tejasvi Surya over the Kannada language row

నిజమెంత: సింగర్ సోనూ నిగమ్ కన్నడ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయొద్దని చెప్పారా? 

ఏప్రిల్ 25న బెంగళూరులో జరిగిన ఒక కాన్సర్ట్ లో కన్నడ పాటలు పాడాలంటూ కొందరు సింగర్ సోనూ నిగమ్ తో దూకుడుగా వ్యవహరించారు. కొందరు చేసిన డిమాండ్లను పహల్గామ్ ఉగ్రవాద దాడితో సోను నిగమ్ పోల్చడం ఇటీవల వివాదానికి దారితీసింది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఎకనామిక్ టైమ్స్‌తో సహా అనేక మీడియా సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్, కస్టమర్ మధ్య భాషా వివాదాన్ని చూపించే వైరల్ వీడియోపై భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను సోనూ నిగమ్ విమర్శించాడని నివేదించాయి.

Xలో చేసిన ఒక పోస్ట్‌లో, తేజస్వి సూర్య బ్యాంకు ఉద్యోగి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని అన్నారు. కస్టమర్ సర్వీస్‌లో పనిచేసే వ్యక్తులు కస్టమర్లతో వారు అర్థం చేసుకునే భాషలో మాట్లాడాలని కోరారు.

సూర్య పోస్ట్‌కు సోను నిగమ్ ప్రతిస్పందించినట్లుగా ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. "కన్నడ సినిమాలను హిందీలో డబ్ చేయవద్దు! కన్నడ సినిమాలను భారతదేశం అంతటా విడుదల చేయవద్దు! కన్నడ సినిమా తారలకు మిస్టర్ @Tejasvi_Suryaకి ఇలా చెప్పే ధైర్యం మీకు ఉందా" అని ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తేలింది. ఎందుకంటే వైరల్ పోస్టుల్లోని X ఖాతా గాయకుడు సోను నిగమ్‌కు చెందినది కాదు, ఆయన కొంతకాలంగా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా లేరు. ‘@SonuNigamSingh’

అనే ఖాతా బయోలో దాని యజమానిని బీహార్‌కు చెందిన క్రిమినల్ న్యాయవాది అని తెలుస్తోంది.

మేము అదే హ్యాండిల్‌తో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా కనుగొన్నాము, అందులో సోనూ నిగమ్ కాకుండా వేరే వ్యక్తికి సంబంధించిన సమాచారం లభించింది.

గాయకుడు సోను నిగమ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మేము సమీక్షించాము. మే 22 నాటి పోస్ట్‌ను కనుగొన్నాము, అందులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు మీడియా సంస్థలను, ముఖ్యంగా ది టైమ్స్ ఆఫ్ ఇండియాపై విమర్శలు గుప్పించారు.

“తాను ట్విట్టర్‌లో లేనని చాలా సార్లు చెప్పాను? అయినా నా పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా నన్ను ప్రేమిస్తున్న వ్యక్తుల మనస్సులను విషపూరితం చేస్తుంది...” అని తెలిపారు.

2023లో కూడా అనేక మీడియా సంస్థలు అదే క్రిమినల్ న్యాయవాది ఖాతా నుండి వచ్చిన ట్వీట్‌ను గాయకుడు సోను నిగమ్‌కు ఆపాదించాయి.

న్యూస్‌మీటర్ వివరణాత్మక దర్యాప్తులో, ‘@SonuNigamSingh’ ఖాతా సింగర్ సోనూ నిగమ్ కు చెందినది కాదని తేలింది. సోనూ నిగమ్ 2017లో X (గతంలో ట్విట్టర్) నుండి నిష్క్రమించారు.

కాబట్టి, కన్నడ భాషా వివాదంలో గాయకుడు సోను నిగమ్ తేజస్వి సూర్యను విమర్శించారంటూ వైరల్ అవుతున్న మీడియా నివేదికల్లో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Credit: Mahfooz Alam

Claim Review:సింగర్ సోనూ నిగమ్ కన్నడ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయొద్దని చెప్పారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story