నిజమెంత: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం సిక్కులు ప్రార్థనలు చేశారా?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సిక్కులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jan 2024 6:38 AM
NewsMeterFactCheck, Sikh, Ram Temple

నిజమెంత: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం సిక్కులు ప్రార్థనలు చేశారా? 

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సిక్కులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

అయోధ్యలో ఈరోజు సిక్కులు, హిందువులు కలిసి రాముడిని, గురునానక్ ని స్మరించుకున్నారు. గురు గోవింద్ సింగ్ జీకి నివాళులు అర్పించారని వీడియోను షేర్ చేశారు. “#Ayodhya - Today Sikhs and Hindus together remembered Prabhu Ram and Guru Nanak Dev ji at Ram Ki Pedhi and paid tribute to Guru Gobind Singh Ji,” అనే వాదనతో వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

ఈ వీడియో కనీసం ఐదేళ్ల నాటిదని.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఎలాంటి లింక్ లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.

మేము ‘బోలో రామ్ బోలో రామ్’ అనే కీవర్డ్‌ల ద్వారా సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించాము. డిసెంబర్ 28, 2021న ప్రచురించిన YouTube వీడియోను మేము గుర్తించాం.

వైరల్ వీడియోకు సంబంధించిన ఎక్స్టెండెడ్ వీడియోను కూడా గుర్తించాం. నిడివి ఎక్కువగా ఉన్న వీడియోను ‘Bhai Manpreet Singh Ji Kanpuri’ అనే యూట్యూబ్ ఛానల్ లో ఏప్రిల్ 8, 2020న అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోను 40:15 నిమిషాల వద్ద మనం చూడొచ్చు.

వీడియో మీద ఉన్న టికర్ కారణంగా.. 2019 ఫిబ్రవరి 20-24 తేదీలలో ముంబైలో జరిగిన వార్షిక అఖండ కీర్తన సమాగమం గురించి స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీడియోలో పేర్కొన్న వెబ్‌సైట్ డొమైన్ ‘akg.org’ని కూడా మేము కనుగొన్నాము.

వెబ్‌సైట్ లో అఖండ కీర్తనీ జాతా (AKJ)లో.. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ముందు సిక్కులు సమిష్టిగా కీర్తనలు పాడారని పేర్కొంది. మేము AKJ కి సంబంధించిన YouTube ఛానెల్‌లో ఫిబ్రవరి 24, 2019న వీడియోను కనుగొన్నాము.

అందువల్ల, వైరల్ క్లిప్ 2019 నాటిదని.. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.

Credits: Md Mahfooz Alam

Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story