భారత ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పోలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో మొదటి క్లిప్‌లో నరేంద్ర మోదీ ఒక వేదికపై నుండి భారత జెండాను తీసుకొని తన జేబులో పెట్టుకోవడం చూపిస్తుంది. రెండవ క్లిప్‌లో బహిరంగ ర్యాలీలో భారత జెండాను పక్కకు తీయమని గాంధీ కోరినట్లు ఉంది.
“తేడా స్పష్టంగా ఉంది…” అని వీడియోను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
బీజేపీకి చెందిన అమిత్ మాళవియ రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ క్లిప్‌ను షేర్ చేసారు,“Rahul Gandhi asks India’s flag to be taken down…This is straight out of George Soros’s rule book, where he asks his protégée to insult and demean everything Indian. (sic)” అంటూ పోస్టు పెట్టారు. రాహుల్ గాంధీ భారతదేశ జెండాను తొలగించమని అడుగుతారు…ఇది నేరుగా జార్జ్ సోరోస్ నియమ పుస్తకం నుండి వచ్చిందని ఆయన ట్వీట్ అర్థం.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వీడియో క్లిప్ ఎడిట్ చేశారని గుర్తించింది. అలాగే సందర్భానికి సంబంధించిన సమాచారం కూడా సరిగా లేదని కనుగొంది.
మేము కాంగ్రెస్ యూట్యూబ్ ఛానెల్‌ని బ్రౌజ్ చేబహిరంగ ర్యాలీలో భారత జెండాను తొలగించాలని రాహుల్ గాంధీ కోరుతున్నట్లు వైరల్ వీడియోలో ఉందిసాము. మార్చి 13న ‘#BharatJodoNyayYatra Resumes from Dondaicha, Mahesh’ అనే శీర్షికతో ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోను చూశాము.
పూర్తి వీడియో చూసిన తర్వాత, భారత్ జోడో న్యాయ్ యాత్ర నుండి భారత జెండాను తొలగించమని గాంధీ కోరలేదని మేము కనుగొన్నాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూపించడానికి జెండాకు ఉన్న కర్ర గురించి ఆయన వివరించారు.
9:50 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద, రాహుల్ గాంధీ తన వాహనంలో నుండి సంతోష్ జైస్వాల్ పాటిల్ అనే వ్యక్తిని తన దగ్గరకు పిలిచారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) వంటి సెంట్రల్ ఏజెన్సీలను ఎలా అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందనే విషయాన్ని వివరించారు.
పాకిస్తాన్, చైనా గురించి మాట్లాడటం ద్వారా ప్రజలను ఆ వైపు ఆలోచించేలా చేస్తారని. ఆలా ప్రజలు పరధ్యానంలో ఉండగా, ‘అదానీ మీ జేబును దోచుకుంటారని.. ఆపై అమిత్ షా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడానికి కర్రను ఉపయోగిస్తున్నారని’ రాహుల్ గాంధీ ఆరోపించారు.
11.12 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద.. రాహుల్ గాంధీ ప్రజల నుండి కర్రను అడిగాడు. కాంగ్రెస్ మద్దతుదారులు ఒక కర్ర నుండి ఒక జెండాను తీసివేశాడు. ఒరిజినల్ వీడియోను ఎడిట్ చేసి.. కేవలం జెండాను తీసివేసేది మాత్రం వైరల్ క్లిప్ లో ఉంచారు.
అందువల్ల, రాహుల్ గాంధీ కర్ర కోసం జెండాను తీసివేయమని కోరిన వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సందర్భం గురించి తెలియజేయకుండా వీడియోను అప్లోడ్ చేశారని మేము నిర్ధారించాము.
Credits: Md Mahfooz Alam