నిజమెంత: కేరళ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బహిరంగంగా మద్యం తాగారా?

కేరళ కాంగ్రెస్ నేత కెసి.వేణుగోపాల్, రాహుల్ గాంధీ సహా ఇతర నేతలతో కలిసి రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తున్నారంటూ ఓ చిత్రం వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2024 10:00 AM IST
KC Venugopal, Tea, alcohol

నిజమెంత: కేరళ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బహిరంగంగా మద్యం తాగారా? 

కేరళ కాంగ్రెస్ నేత కెసి.వేణుగోపాల్, రాహుల్ గాంధీ సహా ఇతర నేతలతో కలిసి రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తున్నారంటూ ఓ చిత్రం వైరల్‌గా మారింది. ఫోటోలో రాజ్యసభ ఎంపీ కెసి వేణుగోపాల్ నలుపు రంగు ద్రావణం ఉన్న గ్లాస్‌ను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే దీన్ని చూసిన చాలా మంది ఇది మద్యం అని ఆరోపిస్తున్నారు.

కేరళ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఒక X వినియోగదారుడు ఫోటోను షేర్ చేసి “ఈ రెస్టారెంట్‌కు మద్యం విక్రయించడానికి లైసెన్స్ లేదు. కాంగ్రెస్ నేతలకు మద్యం ఎలా అందిస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు. (ఆర్కైవ్)

ఈ పోస్టులో IANS లోగోను మనం చూడొచ్చు. 'రాహుల్ గాంధీ వాయనాడ్ కు వెళ్లే దారిలో తామరసేరిలోని వైట్ హౌస్ అనే హోటల్ దగ్గర ఆగారు' అంటూ IANS కథనాన్ని పంచుకుంది. ఆ వీడియోలోని స్క్రీన్ షాట్ ను తీసుకుని నెటిజన్లు వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.

కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ కోజికోడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. వైరల్ అవుతున్న వాదన పూర్తిగా నిరాధారమని, రెస్టారెంట్‌లో తాము ఎలాంటి మద్యాన్ని అందించడం లేదని ఖండించారు. మద్యం విక్రయించడానికి లైసెన్స్ లేదు. వైరల్ వీడియోలో టీ పొడి గాజు అడుగున స్పష్టంగా కనిపిస్తూ ఉందని ఆయన తెలిపారు. కెసి వేణుగోపాల్‌కు బ్లాక్ టీ అందించినట్లు ఆయన ధృవీకరించారు. వేణుగోపాల్ పట్టుకున్న గాజును నిశితంగా పరిశీలిస్తే అడుగున టీ పొడి లాంటి పదార్ధం కనిపించింది. ఇది బ్లాక్ టీ గ్లాసుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.

వైరల్ ఇమేజ్‌లో కనిపించే గ్లాస్ సాధారణంగా ఆల్కహాల్ సర్వ్ చేయడానికి ఉపయోగిస్తారని చాలా మంది వ్యాఖ్యానించారు. రెస్టారెంట్ Google రివ్యూలలో కనిపించే చిత్రాలను చూశాం. ఆ హోటల్ లో టీని అందించే గ్లాసులతో పోల్చి చూశాం. వివిధ రకాల టీలు అందించే గ్లాసులతో.. వైరల్ ఫోటోలోని గాజుతో పోల్చాము.

వినియోగదారులకు వివిధ రకాల టీలను అందించడానికి హోటల్ సిబ్బంది అలాంటి గాజు గ్లాస్ లను ఉపయోగిస్తోందని పోల్చి తెలుసుకున్నాం.

వైరల్ పోస్టులపై కాంగ్రెస్ స్పందించినట్లు కొన్ని మీడియా కథనాలను మేము గమనించాం. 'అది టీ, ఆల్కహాల్ కాదు: కె సి వేణుగోపాల్ వైరల్ ఫోటోపై కాంగ్రెస్ స్పష్టం చేసింది' అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన నివేదికను మేము కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు గుర్తించాం. నివేదిక ప్రకారం, కాంగ్రెస్ వైరల్ ఫోటోపై వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ రెస్టారెంట్‌లో వేణుగోపాల్ మద్యం సేవిస్తున్నాడనే వాదనల్లో ఎలాంటి నిజం లేదని, ఫేక్ న్యూస్ అని పేర్కొంది. ఆ గ్లాసులో ఉన్నది బ్లాక్ టీ మాత్రమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాదనపై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

నివేదిక ప్రకారం, నకిలీ వార్తల వ్యాప్తి వెనుక శశాంక్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడని కాంగ్రెస్ ఆరోపించింది.

NDTV, ANI న్యూస్ కథనాలను కూడా మేము కనుగొన్నాము.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో తెలిపింది. ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా పంచుకుంది.

వైరల్ అవుతున్న ఫోటోలో వేణుగోపాల్ మద్యం తీసుకోలేదని, బ్లాక్ టీ తాగారని స్పష్టమవుతోంది.

credits: Sibahathulla Sakib

Claim Review:కేరళ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ బహిరంగంగా మద్యం తాగారా?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story