నిజమెంత: క్రిస్టియానో రొనాల్డో ఇస్లాం ను స్వీకరించారా?
జనవరి 2023లో ఫుట్‌బాల్ ఆటగాడు మాస్ట్రో క్రిస్టియానో రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో అల్-నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Dec 2024 7:58 AM ISTనిజమెంత: క్రిస్టియానో రొనాల్డో ఇస్లాం ను స్వీకరించారా?
జనవరి 2023లో ఫుట్‌బాల్ ఆటగాడు మాస్ట్రో క్రిస్టియానో రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో అల్-నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు, ఏటా 200 మిలియన్ల యూరోలకు పైగా విలువైన ఒప్పందంపై సంతకం చేశాడు. అతను సౌదీ అరేబియాకు సాంస్కృతిక రాయబారిగా కూడా పనిచేస్తున్నాడు, క్రీడలు, పర్యాటక రంగం ద్వారా దేశానికి సంబంధించిన గ్లోబల్ ఇమేజ్‌ను పెంచడానికి విజన్ 2030కి మద్దతు ఇస్తున్నారు.
ఈ సందర్భంగా రొనాల్డో తన భార్యతో కలిసి తెల్లటి దుస్తులు ధరించి మక్కాలో ప్రార్థన చేస్తున్న అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రొనాల్డో ఇస్లాంను స్వీకరించినట్లు సోషల్ మీడియా పోస్టుల్లో చెబుతున్నారు.
ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని షేర్ చేసి, "మాషల్లా: ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఇస్లాంను స్వీకరించారు. తన భార్యతో కలిసి నమాజ్ చేసారు...!" అంటూ అందులో ఉంది. (ఆర్కైవ్)
ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ చిత్రాలను AI ద్వారా రూపొందించారు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.
చిత్రాలలో రొనాల్డో ప్రార్థన చేస్తున్న తీరు చూస్తే ఆ చిత్రాలు నకిలీవేమోననే అనుమానాన్ని రేకెత్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాలోని మస్జిద్ అల్-హరమ్ మసీదులో ఉన్న పవిత్ర కట్టడం అయిన కాబాకి ఎదురుగా ప్రార్థన చేస్తారు. అయితే, ఈ చిత్రాలు కాబా నుండి దూరంగా ప్రార్థిస్తున్న జంటను చూపుతున్నాయి.
చిత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాత, రోనాల్డోకు ఒక చేతి మీద ఆరు వేళ్లు ఉన్నాయి. AI ద్వారా రూపొందించిన చిత్రాలలో ఇది ఒక సాధారణ లోపం అని మేము ఒక చిత్రంలో గమనించాము. అలాగే, ఒక చిత్రంలో రోనాల్డో ముఖంలో తేడాలు ఉన్నాయి అనిపించింది.
మేము AI డిటెక్షన్ టూల్ ట్రూ మీడియా ద్వారా చిత్రాలలో ఒరిజినాలిటీని కనుగొనేలా చేసాము. చిత్రాలలో జనరేటివ్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కు సంబంధించిన పలు సాక్ష్యాలను కనుగొన్నాము.
హైవ్ మోడరేషన్ ద్వారా చిత్రాన్ని రన్ చేస్తున్నప్పుడు కూడా ఏఐ ద్వారా సృష్టించారనే ఫలితాలు కనిపించాయి. ఈ చిత్రాలలో ఒకదానిలో 97.1 శాతం AI ద్వారా రూపొందించిన లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉన్నట్లు గుర్తించింది.
మేము రొనాల్డో ఇస్లాం స్వీకరించిన నివేదికల కోసం వెతికాము కానీ ఏదీ కనుగొనలేదు.
అందువల్ల, వైరల్ చిత్రాలు AI ద్వారా రూపొందించినవి, అతను ఇస్లాంను స్వీకరించిన వాదన తప్పు అని మేము నిర్ధారించాము.
Credit: Md Mahfooz Alam