నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ లో ఓ వ్యక్తి వెనుకకు చూడకుండా షూటింగ్ లో పాల్గొన్నాడా?

2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న టర్కీ షూటర్ యూసుఫ్ డికేక్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాడు.

By అంజి  Published on  4 Aug 2024 4:30 PM GMT
NewsMeterFactCheck, 2024 Paris Olympics,

నిజమెంత: పారిస్ ఒలింపిక్స్ లో ఓ వ్యక్తి వెనుకకు చూడకుండా షూటింగ్ లో పాల్గొన్నాడా? 

2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న టర్కీ షూటర్ యూసుఫ్ డికేక్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాడు. ఏ మాత్రం అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉపయోగించకుండా అతడు ఒలింపిక్స్ లో పాల్గొని అందరినీ షాక్ కు గురి చేశాడు. ఎంతో సులువుగా ఆయన షూట్ చేస్తూ కనిపించడంతో.. ఆయనలో ఉన్న ట్యాలెంట్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. తన జేబులో ఒక చేయిని పెట్టుకుని.. మరో చేత్తో షూట్ చేస్తూ, సాధారణ గ్లాసెస్ ధరించి టీ-షర్టులో కనిపించి.. అందరినీ షాక్ కు గురి చేశారు.

ఈ నేపథ్యంలో ఓ షూటర్ తన ఎదురుగా అద్దం పెట్టుకుని.. వెనుకకు తుపాకీని గురిపెట్టి షూట్ చేస్తున్నన చిత్రం వైరల్‌గా మారింది. ఈ చిత్రం ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లోనిదని పలువురు షేర్ చేస్తూ ఉన్నారు. (ఆర్కైవ్)

పలు సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ పోస్టును షేర్ చేసి.. మరో వ్యక్తి అద్భుతం చేస్తున్నాడంటూ ప్రచారం చేశారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఫోటోషాప్ ఉపయోగించి ఒలింపిక్స్ ను బ్యాగ్రౌండ్ లో డిజిటల్‌గా ఉంచారు. అసలు చిత్రం థాయ్‌లాండ్‌లోని ‘చింగ్ రోయ్ చింగ్ లాన్’ గేమ్ షో నుండి వచ్చింది.

ఫోటోలో ఉన్న వ్యక్తి నటుడు-హాస్యనటుడు పొంగ్సాక్ పొంగ్సువాన్. వైరల్ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఆగస్ట్ 2న Xలో పోస్ట్ చేసిన అదే దృశ్యాన్ని వర్ణించే వీడియోను మేము కనుగొన్నాము. గేమ్ షోలో అద్దంలో లక్ష్యానికి సంబంధించిన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఒక వ్యక్తి వెనుకకు కాల్చడాన్ని వీడియో చూపిస్తుంది. అయితే ఈ వీడియోకు పారిస్ ఒలింపిక్స్ కు ఎలాంటి సంబంధం లేదు.

ఆగస్ట్ 15, 2019న థాయ్‌లాండ్‌కు చెందిన వర్క్‌పాయింట్ టీవీ తన అధికారిక YouTube ఛానెల్‌లో అప్లోడ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కూడా మేము కనుగొన్నాము. కామెడీ గేమ్ షోలో పిస్టల్‌తో టార్గెట్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు అనేక మంది వ్యక్తులను ఈ వీడియో చూపిస్తుంది. సదరు వ్యక్తి వెనుకకు కాల్చే వైరల్ దృశ్యం 3:10 నిమిషాల మార్క్‌లో మనం చూడొచ్చు.


ఛానెల్ ప్రకారం, ఈ వీడియో 'చింగ్ రోయ్ చింగ్ లాన్' షో నుండి వచ్చింది, ఇది ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది.

'చింగ్ రోయ్ చింగ్ లాన్' 1990లో మొదటిసారిగా ప్రసారమైన ఒక ప్రసిద్ధ థాయ్ గేమ్ షో. ఈ షో గేమ్ షోలో ఎక్కువగా కామెడీ మీద ఉంటుంది. ఇందులో హోస్ట్‌లు, హాస్య నటులు, పలువురు ప్రముఖులు అతిథులుగా ఎన్నో ఏళ్లుగా పాల్గొంటూ ఉన్నారు. మంచి పాపులారిటీ ఉన్న గేమ్ షో. 'వావ్ వావ్ వావ్' అనే టాస్క్ లో భాగంగా ఒక హాస్యనటుడు మ్యాజిక్ ట్రిక్ ప్రదర్శించాడు. అది చూసిన ప్రేక్షకులు షాక్ అవుతారు. అద్దంలో చూస్తూ వెనుకకు షూట్ చేస్తున్న వ్యక్తి థాయ్ నటుడు, కమెడియన్ పోంగ్‌సాక్ పొంగ్సువాన్ అని మేము కనుగొన్నాము.

కాబట్టి, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న వ్యక్తి అద్దంలో చూస్తూ షూటింగ్‌ చేయడం లేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credit: Md Mahfooz Alam

Next Story