నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది అనుష్క యాదవ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్?

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి, ఆయన కుటుంబం నుంచి బహిష్కరించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 3 Jun 2025 1:30 PM IST

NewsMeterFactCheck, Anushka Yadav, Tej Pratap Yadav

నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది అనుష్క యాదవ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్? 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి, ఆయన కుటుంబం నుంచి బహిష్కరించారు. అనుష్క యాదవ్ అనే మహిళతో తనకు 12 ఏళ్ల సంబంధం ఉందని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్న తర్వాత ఆయన్ను పార్టీ నుంచి, ఆయన కుటుంబం నుంచి బహిష్కరించారు.

తేజ్ ప్రతాప్ తన అకౌంట్ హ్యాక్ కావడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. అయినప్పటికీ ఈ పోస్ట్ ప్రజల ఆగ్రహానికి, అంతర్గత విభేదాలకు దారితీసింది. పార్టీ, కుటుంబ విలువలను ఉల్లంఘించడమే తేజ్‌ను ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించడానికి కారణమని లాలూ పేర్కొన్నారు.

ఈ సందర్భంలో, తేజ్ ప్రతాప్ అనుష్క యాదవ్‌తో ఉన్న ఫోటోను, ఒక మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్‌లో ఉన్న మహిళ అనుష్క యాదవ్ అని, ఆమెకు రీల్స్ చేయడం అంటే ఇష్టమని యూజర్లు చెబుతున్నారు.

"తేజు భయ్యా భార్య అనుష్క యాదవ్ కూడా రీల్ మేకర్‌గా మారిపోయింది. కృష్ణుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చివరికి అతను రీల్స్‌లో ఉన్న ఒక అమ్మాయి వ్యవహారంలో చిక్కుకున్నాడు" అని ఒక X యూజర్ వీడియోను షేర్ చేశారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

రీల్‌లో ఉన్నది అనుష్క యాదవ్ కాదు. కాబట్టి ఈ వాదనలో నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా, ఈ వీడియోను మొదట రచన అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఏప్రిల్ 8న “ఫిట్‌నెస్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారని తేలింది. ఆమె తనను తాను డిజిటల్ క్రియేటర్‌గా చెబుతున్నారు.

ఆ ఖాతాను మరింత పరిశీలించగా, రచన తన భర్త, పిల్లలతో కలిసి ఉన్న అనేక రీల్స్ కనిపించాయి. (లింక్స్‌ కోసం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్‌ చేయండి)

అనుష్క, రచనల చిత్రాల పోలిక ఇక్కడ ఉంది.

కాబట్టి, వైరల్ క్లిప్‌లో ఉన్నది అనుష్క యాదవ్ కాదు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన రచన ఉందని మేము నిర్ధారించాము.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Credit: Mahfooz Alam

Claim Review:వైరల్ వీడియోలో ఉన్నది అనుష్క యాదవ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story