నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) వద్ద శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం, 9N-AME (CRJ 200) టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. పోఖారా వెళ్లే విమానంలో 19 మంది ఉన్నారు. విమానం పైలట్ 37 ఏళ్ల మనీష్ షాక్యాను శిథిలాల నుంచి రక్షించి చికిత్స నిమిత్తం సినమంగల్‌లోని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి పొగలు కమ్ముకున్నాయి. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అంటూ పలువురు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
“Plane crashes during takeoff in Nepal, killing at least 18.” అనే టైటిల్ తో ఓ వీడియోను నెటిజన్ షేర్ చేశారు. ఒక వ్యక్తి టెర్రస్ పై నుండి విమాన ప్రమాదాన్ని రికార్డ్ చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది. (ఆర్కైవ్)
"నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానం కూలిపోయిన క్షణాన్ని నెటిజన్లు క్యాప్చర్ చేశారు." అంటూ మరో ట్విట్టర్ యూజర్ కూడా వీడియోను షేర్ చేశారు. (ఆర్కైవ్)
నిజ నిర్ధారణ:
2023లో నేపాల్‌లో ఇంతకు ముందు జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇదని న్యూస్‌మీటర్ గుర్తించింది. కాబట్టి, వైరల్ అవుతున్న వాడినా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది.
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. జనవరి 15, 2023న న్యూస్ 18 అధికారిక X హ్యాండిల్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారని మేము కనుగొన్నాము. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై 72-సీట్ల ప్రయాణీకుల విమానం కూలిపోయిందని ఛానెల్ నివేదించింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులతో సహా ప్రయాణికులందరూ మరణించారు.
ABC న్యూస్ తన యూట్యూబ్ ఛానెల్‌లో జనవరి 16, 2023న “నేపాల్‌లో యతి ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ ప్లేన్ క్రాష్ అయ్యింది” అనే శీర్షికతో ప్రచురించిన విమాన ప్రమాద వీడియోను కూడా మేము కనుగొన్నాము.
విమానం ఖాట్మండు రాజధాని నుండి సెంట్రల్ నేపాల్‌లోని పోఖారాకు వెళుతున్నట్లు కూడా ఛానెల్ పేర్కొంది.
హిందుస్తాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జనవరి 15, 2023న ప్రచురించిన తమ కథనాలలో, నేపాల్‌లోని పోఖారాలో 72 మంది ప్రయాణికులతో కూడిన యతి ఎయిర్‌లైన్స్ క్రాష్ గురించి నివేదించాయి. పలు మీడియా సంస్థలు నేపాల్ లో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా అభివర్ణించాయి.
అందువల్ల, వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.
Credit: Md Mahfooz Alam