Fact Check: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ బ్రతికే ఉన్నారు

వైట్ హౌస్ నుండి ఒక మృతదేహాన్ని బయటకు తీసుకునివస్తున్నట్లు అనిపించే ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2023 8:19 AM IST
Joe Biden, conspiracy theory, newsmeterfactcheck

Fact Check: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ బ్రతికే ఉన్నారు

వైట్ హౌస్ నుండి ఒక మృతదేహాన్ని బయటకు తీసుకునివస్తున్నట్లు అనిపించే ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

వైరల్ వీడియోకు సంబంధించి యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ లేదా అతని బాడీ డబుల్ చనిపోయారని చెబుతూ ఉన్నారు. దీని చుట్టూ ఎన్నో ఊహాగానాలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయి. 2022 నుంచి ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.

“Is that a body? Is this real?” అంటూ పోస్టు పెట్టగా.. మరొక యూజర్ “Yuuuup. That’s Joe Biden.” అంటూ సమాధానం ఇచ్చారు.

వీడియోను పంచుకుంటూ.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు “అది శరీరమా? ఇది నిజామా?" అంటూ అడిగారు. ఈ పోస్ట్‌కు ప్రత్యుత్తరం ఇస్తూ, మరొక వినియోగదారు రీట్వీట్ చేసారు, “అవును.. అది జో బిడెన్." అంటూ చెప్పుకొచ్చారు.

బిడెన్ స్థానంలో ఆయన క్లోన్ ఉన్నట్లు వీడియో చూపుతుందని ఒక కుట్ర సిద్ధాంతకర్త కూడా పేర్కొన్నారు.

బిడెన్ బాడీ డబుల్స్ ఉన్నారంటూ.. ఆయనను పోలిన వ్యక్తులు చాలా మందే ఉన్నారంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారం సాగుతూ వస్తోంది.

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీలు.

US ప్రెసిడెంట్ మరణానికి సంబంధించిన ఏదైనా విశ్వసనీయమైన మీడియా నివేదిక కోసం వెతకడం ద్వారా మేము మా దర్యాప్తును ప్రారంభించాము. జో బిడెన్ మరణవార్త ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యుండేది.. అటువంటి సంఘటనకు సంబంధించిన పోస్టును మేము చూడలేకపోయాం. వైరల్ వీడియోకు మద్దతు ఇచ్చే నివేదికకు సంబంధించి ఏ మీడియా సంస్థకు సంబంధించిన కథనాన్ని కనుగొనలేకపోయాము.

వీడియోలోని టైమ్ స్టాంప్ జూన్ 23, 2022 తేదీకి సంబంధించినది. ఈ తేదీ తర్వాత బిడెన్ మీడియాకు అనేకసార్లు మీడియా ముందు కనిపించారు.

వీడియోలో చూపిన బ్యాగ్‌లో ఏముందో నిర్ధారించడం కష్టం. వైరల్ వీడియోలో బాడీ బ్యాగ్ అని చెప్పబడే మొదటి బ్యాగ్‌ నలుపు రంగులో ఉంది. ఇక్కడ సాధారణ ప్రశ్న ఏమిటంటే, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిని రహస్యంగా బాడీ బ్యాగ్‌లో వైట్ హౌస్ నుండి ఎందుకు బయటకు తీసుకువస్తారు?

ఇవన్నీ కాన్స్పిరసీ థియరీల కింద వస్తాయి.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన వాదనను వినిపిస్తూ ఉంటారు.

బ్యాగ్‌లలో ఏముందో తెలుసుకోవడం కష్టమే.. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాత్రం సజీవంగా ఉన్నారని, వైరల్ వీడియో బయటకు వచ్చిన తేదీ తర్వాత కూడా మీడియాకు అనేకసార్లు కనిపించారని స్పష్టమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కూడా జో బిడెన్ ఆయనతో సమావేశం అయ్యారు.

వైరల్ అవుతున్న వాదనల్లో ఎటువంటి నిజం లేదు.

Credits : Sunanda Naik

Claim Review:అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ బ్రతికే ఉన్నారు
Claimed By:social media user
Claim Reviewed By:Newsmeter
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story