Fact Check: ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బీసీసీఐని క్రికెట్ మాఫియా అని అన్నారా?

ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ భారత్‌పైనా, బీసీసీఐ పైనా విమర్శలు చేసినట్లుగా ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2023 7:30 AM GMT
NewsMeterFactcheck, Ricky Ponting, BCCI

Fact Check: ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బీసీసీఐ ను క్రికెట్ మాఫియా అని అన్నారా? 

ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ భారత్‌పైనా, బీసీసీఐ పైనా విమర్శలు చేసినట్లుగా ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెల్‌తో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)ని 'క్రికెట్ మాఫియా' అని అభివర్ణించాడని ప్రచారం చేస్తున్నారు. గణనీయమైన ఆర్థిక, ప్రభావవంతమైన వనరులు ఉన్నప్పటికీ భారతదేశం ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయిందని ఈ పోస్టును షేర్ చేస్తూ నెటిజన్లు విమర్శిస్తూ ఉన్నారు.

“This is a win of justice against cricket mafia. Your money and power is still not winning World Cups for you. How embarrassing (sic),” అంటూ ఓ ట్విట్టర్ యూజర్ పోస్టు పెట్టారు. ఆస్ట్రేలియా విజయం క్రికెట్ మాఫియాకు వ్యతిరేకంగా జరిగిన విజయమని అందులో అన్నారు. డబ్బు, పవర్ అన్నది ట్రోఫీని గెలవనివ్వదని అన్నారు.

పలు సోషల్ మీడియా పోస్టులను ఇక్కడ, ఇక్కడ అండ్‌ ఇక్కడ, ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు.

నిజ నిర్ధారణ:

ఫాక్స్ స్పోర్ట్స్ ఛానెల్‌లో రికీ పాంటింగ్ అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని న్యూస్‌మీటర్ ధృవీకరించింది.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము.. కానీ పాంటింగ్ ప్రకటనను నివేదించే విశ్వసనీయమైన మీడియా కథనాన్ని కనుగొనలేకపోయాం. బీసీసీఐని ‘క్రికెట్ మాఫియా’ అని ఆస్ట్రేలియా మాజీ సారథి అని ఉంటే మాత్రం అది కాస్తా పెద్ద న్యూస్ అయి ఉండేది.

నవంబర్ 20 నుండి ఫాక్స్ క్రికెట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ‘రికీ పాంటింగ్, మైఖేల్ వాన్, నాజర్ హుస్సేన్ భారత ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ ‘బ్యాక్‌ఫైర్’కి కారణం అని పిలిచారు.’ అనే నివేదికను మేము కనుగొన్నాము. అందులో భారత్ ఓటమికి గల కారణాల గురించి చర్చించారు.

నివేదిక ప్రకారం, ఆసీస్ క్రికెట్ ఐకాన్ ఫైనల్ కు తయారు చేసిన పిచ్ భారత్‌కు పెద్ద దెబ్బ తగలడానికి కారణమని చెప్పాడు. అయితే ఎక్కడా కూడా పాంటింగ్ BCCIని 'క్రికెట్ మాఫియా'గా అభివర్ణింలేదు. ఆర్థికంగా బాగున్నా ప్రభావవంతమైన వనరులు ఉన్నప్పటికీ భారత్ ICC ట్రోఫీని గెలవలేకపోయిందని పాంటింగ్ ఎక్కడా చెప్పలేదు.

మేము ఫాక్స్ క్రికెట్ కు సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా స్క్రోల్ చేసాము.. అయితే నెటిజన్లు ఆరోపించినట్లుగా ఎలాంటి వ్యాఖ్యలు కూడా పాంటింగ్ చేసినట్లు.. వీడియో క్లిప్ లేదా వార్తను కనుగొనలేకపోయాము.

పాంటింగ్ ఏకంగా బీసీసీఐని విమర్శించినట్లుగా ఎటువంటి నివేదిక లేదా ఆధారాలు కనుగొనలేకపోయాము. పాంటింగ్ కు ఆపాదించబడిన ప్రకటన తప్పు అని మేము నిర్ధారించాము.

Claim Review:ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బీసీసీఐ ను క్రికెట్ మాఫియా అని అన్నారా?
Claimed By:X and Facebook users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X and Facebook
Claim Fact Check:False
Next Story