ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 15,000 రూపాయల బాండ్, లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ను అనుమతించినట్లు ABP న్యూస్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేయగా.. ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీ ఏప్రిల్ 1తో ముగిసింది.
"అరవింద్ కేజ్రీవాల్ కోర్టు నుండి బెయిల్ పొందారు," ఒక X వినియోగదారుడు పోస్టు పెట్టారు. చాలా మంది X వినియోగదారులు అదే క్లెయిమ్ చేస్తూ వీడియో (ఆర్కైవ్)ను షేర్ చేసారు. ఆర్కైవ్ పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
ఈ వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. కేజ్రీవాల్‌కి ఇచ్చిన బెయిల్‌పై ఏబీపీ న్యూస్ నివేదించిన వైరల్ వీడియో పాతది.
కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడానికి సంబంధించి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుపై ఏప్రిల్ 1న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (ఆర్కైవ్) నివేదికను కనుగొన్నాము. రూస్ అవెన్యూ కోర్టు నుండి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన అనంతరం ఆయనకు తీహార్ జైలుకు తరలించారు.
ఎన్‌డిటివి (ఆర్కైవ్) కూడా కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ఏప్రిల్ 1 న ముగిసిన తర్వాత, ఆయన్ను ఏప్రిల్ 15 వరకు జైలుకు పంపినట్లు నివేదించింది.
తర్వాత, మేము YouTubeలో ABP వీడియో కోసం వెతికాము.. దానిని మార్చి 16న ABP YouTube ఛానెల్ లో ప్రచురించినట్లు గుర్తించాము.
ది హిందూ (ఆర్కైవ్) మార్చి 16 నివేదిక ప్రకారం.. కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ ఏజెన్సీ సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంతో .. ED చేసిన ఫిర్యాదుకు సంబంధించి కేజ్రీవాల్ మార్చి 16 న కోర్టుకు హాజరయ్యారు.
వైరల్ వీడియో మార్చి 16కు సంబంధించినది. కేజ్రీవాల్ కస్టడీ ఇటీవల ముగియడంతో బెయిల్‌కు అనుమతి ఇవ్వలేదు. ఆయన్ను ఏప్రిల్ 15 వరకు జైలుకు పంపారు. అందుకే, ABP న్యూస్ పాత వీడియోను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో షేర్ చేశారని మేము నిర్ధారించాము.