Fact Check: ఆ ఫోటోలలో ఉన్నది ఇమ్రాన్ ఖాన్ అంటూ ప్రచారం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో చాప మీద కూర్చుని పుస్తకం చదువుతున్నట్లు చూపించే చిత్రాన్ని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Aug 2023 8:08 AM GMT
Pakistan pm imran khan arrest, morphed image of Imran Khan

Fact Check: ఆ ఫోటోలలో ఉన్నది ఇమ్రాన్ ఖాన్ అంటూ ప్రచారం 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో చాప మీద కూర్చుని పుస్తకం చదువుతున్నట్లు చూపించే చిత్రాన్ని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు.

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత లాహోర్‌లోని అతని నివాసంలోనే అరెస్టు చేశారు. జైలులో ఉన్న కొన్ని రోజుల తర్వాత ఈ చిత్రం షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ బృందం.. వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని గుర్తించింది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.

మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. ఫ్రేమ్‌లో ఉన్నది ఇమ్రాన్ ఖాన్ కాదని గుర్తించాం. అందులో ఉన్నది పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు అలీ మహ్మద్ ఖాన్ కు సంబంధించిన చిత్రాలను కనుగొన్నాము. ఈ చిత్రాన్ని 28 జూన్ 2023 నాటి పాకిస్తాన్ PTI అధికారిక పేజీలో ప్రచురించారు.

PTI ఇస్లామాబాద్ అధికారిక X హ్యాండిల్‌లో కూడా మేము అదే చిత్రాన్ని గుర్తించాము. ఆ ట్వీట్‌లో “'అల్లాపై విశ్వాసం బలంగా ఉండి, మనిషి సత్యంతో నిలబడితే, ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని ఓడించదు. తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకుడు అలీ ముహమ్మద్ ఖాన్ జైల్లో పవిత్ర ఖురాన్ పఠిస్తున్నాడు." అని ఉంది.

#ReleaseAliMuhammadKhan అనే హ్యాష్ ట్యాగ్ తో ఫోటోను షేర్ చేశారు.

అనేక ఇతర Twitter వినియోగదారులు కూడా వారి X హ్యాండిల్స్‌లో అతనికి మద్దతుగా అదే చిత్రాన్ని ట్వీట్ చేశారు.

తదుపరి సెర్చ్ లో మాకు జూన్ 29, 2023 నాటి ‘అవినీతి కేసులో జైలులో రిమాండ్‌ లో అలీ మహ్మద్ ఖాన్’ ఉన్నారంటూ పాకిస్థాన్ వార్తాపత్రిక డాన్‌లోని మీడియా నివేదికను మేము గుర్తించాం.

“Central leader of Pakistan Tehreek-i-Insaf (PTI) Ali Moha­mmad Khan was remanded in judicial custody on Wednesday after a magistrate rejected the plea of anti-corruption establishment (ACE) officials for seeking his 14-day physical remand.” అంటూ రిపోర్టును మేము చూశాం. "పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు అలీ మహ్మద్ ఖాన్‌ను 14 రోజుల ఫిజికల్ రిమాండ్ కోసం అవినీతి నిరోధక సంస్థ (ఎసిఇ) అధికారులు కోరారు. అందుకు సంబంధించిన విజ్ఞప్తిని మెజిస్ట్రేట్ తిరస్కరించడంతో బుధవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపారు." అని అందులో ఉంది.

అదే దినపత్రిక ప్రకారం, 80 రోజుల జైలు శిక్ష తర్వాత జూలై 27న బెయిల్‌పై విడుదలయ్యాడు.

రెండు చిత్రాల మధ్య పోలికను మీరు చూడొచ్చు.

కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.

Credits : Sunanda Naik

Claim Review:వైరల్ ఫోటోలలో ఉన్నది ఇమ్రాన్ ఖాన్ అంటూ ప్రచారం
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story