నిజమెంత: ఇజ్రాయెల్‌ హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేసిందా?

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా, రెండు వైపుల నుండి డ్రోన్, వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Jun 2025 11:19 AM IST

NewsMeterFactCheck, Haifa, Israel, Iran, Bazan

నిజమెంత: ఇజ్రాయెల్‌ హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేసిందా?  

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా, రెండు వైపుల నుండి డ్రోన్, వైమానిక దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులు ఇరానియన్ మిసైల్స్ ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న బజాన్ చమురు శుద్ధి కర్మాగారం పేలుడును ఈ వీడియో చూపిస్తుందని తెలిపారు.

"హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారం పైప్‌లైన్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. సైట్‌లో మంటలు చెలరేగాయి" అనే శీర్షికతో ఒక X వినియోగదారు వీడియోను పంచుకున్నారు. (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ వీడియో 2015 నుండి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా దీనిని నవంబర్ 2015లో అనేక యూట్యూబ్ ఛానెల్‌లు అప్‌లోడ్ చేశాయని కనుగొన్నాము. ఈ వీడియో చైనాలోని ఒక రసాయన కర్మాగారం పేలుడుకు సంబంధించిందని పేర్కొన్నారు. (లింక్స్ కొరకు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ క్లిక్‌ చేయండి.)

దక్షిణ చైనా సముద్రంలోని చమురు క్షేత్రంలో భారీ పేలుడును చూపించిందని పేర్కొంటూ ఒక ఫేస్‌బుక్ వినియోగదారు 2016లో ఈ వీడియోను షేర్ చేశారు.

2015 నవంబర్‌లో Military.com అనే వెబ్‌సైట్ కూడా ఈ వీడియోను ప్రచురించింది, ఈ వీడియో చైనాలోని ఒక రసాయన కర్మాగారంలో పేలుడును చూపిస్తుందని పేర్కొంది.

అయితే, NewsMeter వీడియోకు సంబంధించిన లొకేషన్ ను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది, కానీ వీడియో 2015 నుండి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని ధృవీకరిస్తున్నాము.

కొనసాగుతున్న వివాదంలో ఇరాన్ బజాన్ చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుందా?

జూన్ 16న ది జెరూసలేం పోస్ట్ నివేదిక ప్రకారం, ఇరాన్ క్షిపణి దాడి తర్వాత చమురు శుద్ధి కర్మాగారానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు, అనుబంధ సంస్థలు మూసివేసినట్లు బజాన్ గ్రూప్ ప్రకటించింది.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ జూన్ 17 నివేదిక ప్రకారం, ఇరాన్ క్షిపణి దాడి సమయంలో హైఫా చమురు శుద్ధి కర్మాగారం పైప్‌లైన్, ట్రాన్స్‌మిషన్ లైన్‌కు నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ ఇంధన సంస్థ బజాన్ ధృవీకరించింది. సైట్‌లోని ప్రధాన కార్యకలాపాలు పనిచేస్తున్నప్పటికీ, కాంప్లెక్స్‌లోని కొన్ని దిగువ సౌకర్యాలు మూసివేశారు.

అందువల్ల, ఇరాన్ హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, వైరల్ వీడియో పాతదని, ఇరాన్ క్షిపణి దాడి వల్ల సంభవించిన పేలుడు కాదని మేము నిర్ధారించాము.

వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.

Claim Review:ఇజ్రాయెల్‌ హైఫాలోని బజాన్ చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి చేసిందా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Next Story