నిజమెంత: భారతరత్న అవార్డు అందుకున్న వాళ్లకు నిజంగా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా?

భారతదేశంలో ఇచ్చే అత్యంత గౌరవపురస్కారం 'భారతరత్న'. ఈ అవార్డును 1954లో స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2024 9:00 PM IST
Bharat Ratna, newsmeterfactcheck, Ministry of Home Affairs

నిజమెంత: భారతరత్న అవార్డు అందుకున్న వాళ్లకు నిజంగా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా? 

భారతదేశంలో ఇచ్చే అత్యంత గౌరవపురస్కారం 'భారతరత్న'. ఈ అవార్డును 1954లో స్థాపించారు. భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం. ఏదైనా రంగంలో అసాధారణమైన సేవ లేదా అత్యున్నత స్థాయి పనితీరుకు గుర్తింపుగా ఇస్తారు. ఇప్పటి వరకు 53 మంది వ్యక్తులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

భారతరత్న అవార్డు గ్రహీతలకు అందించే ప్రయోజనాలకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు “భారత రత్న అవార్డును గెలుచుకునే వారికి 5 ప్రధాన ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇది అత్యున్నత పౌర పురస్కారం” అంటూ పోస్టులు పెట్టారు.

భారతరత్న అవార్డు అందుకున్న వారికి జీవితకాల ఆదాయపు పన్ను మినహాయింపు, ఎయిర్ ఇండియాలో, భారతీయ రైల్వే ఫస్ట్-క్లాస్ కోచ్‌లో ఉచిత జీవితకాల ప్రయాణం, ప్రయాణంలో పూర్తి సౌకర్యాలు, పార్లమెంటరీ కార్యక్రమాలలో పాల్గొనడం, Z-గ్రేడ్ భద్రత వంటి ప్రయోజనాలు అందుతాయంటూ సోషల్ మీడియా పోస్టు తెలిపింది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.

వైరల్ పోస్టులో పేర్కొన్న విధంగా ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందనే ఎటువంటి నిబంధన లేదని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని NewsMeter కనుగొంది. అయితే, భారతరత్న అవార్డు గ్రహీతలు ఎయిర్ ఇండియాలో జీవితకాలంలో ఉచితంగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణాన్ని పొందుతారు.

మేము దీనికి సంబంధించి.. ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో భారతరత్న అందుకున్న వ్యక్తులకు ఇచ్చే ప్రయోజనాలపై 2014 నుండి RTI ప్రతిస్పందనను గమనించాం.

అవార్డు గ్రహీతలకు పార్లమెంటరీ సమావేశాలలో పాల్గొనడానికి, క్యాబినెట్ ర్యాంక్‌కు సమానమైన అధికారాలు ఇస్తారని, Z-కేటగిరీ భద్రతను అందిస్తారంటూ ఎలాంటి సమాచారం లేదు. భారతీయ రైల్వేలలో ఉచిత లేదా ప్రీమియం ప్రయాణానికి సంబంధించిన ఎలాంటి ప్రయోజనాల గురించి కూడా పేర్కొనలేదు.

భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలను అందించదని స్పష్టంగా తెలిపారు. వెబ్‌సైట్‌లో అవార్డుకు సంబంధించిన ఇతర అంశాలను కూడా వివరించారు.

అవార్డు గ్రహీతలకు అందించే ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి:

1. భారత రత్న అవార్డు గ్రహీతలను భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ప్రయాణించినప్పుడు రాష్ట్ర అతిథులుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

2. విదేశాల్లోని భారతీయ మిషన్లు వారి విదేశాల సందర్శనల సమయంలో అవార్డు గ్రహీతలు కోరినప్పుడు సరైన సౌకర్యాన్ని అందిస్తాయి.

3. వారు ఎయిర్ ఇండియాలో జీవితకాల ఉచిత ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణానికి అర్హులు.

4 .

మేము హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసాము. ప్రముఖుల జాబితాని కూడా కభారతరత్న అవార్డు అందుకున్న వాళ్లకు నిజంగా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా?నుగొన్నాము. ఇందులో రాష్ట్ర, అధికారిక కార్యక్రమాల సమయంలో వ్యక్తులను ఏ క్రమంలో కూర్చోనివ్వాలనే మార్గదర్శకాలను వివరించారు. భారతరత్న అవార్డు గ్రహీతలు రాష్ట్రం వెలుపల పలు మర్యాదలను అందుకోనున్నారు.

అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉందని మేము నిర్ధారించాము.

Credits: Md Mahfooz Alam

Claim Review:భారతరత్న అవార్డు అందుకున్న వాళ్లకు నిజంగా ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా?
Claimed By:Instagram users
Claim Reviewed By:Newsmeter
Claim Source:Instagram
Claim Fact Check:Misleading
Next Story