తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు భక్తులు. ప్రత్యక్షంగా స్వామిని దర్శించుకునే భాగ్యం లేని భక్తులు సైతం ప్రసాదాన్ని అపురూపంగా భక్తితో స్వీకరిస్తారు. అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తులకు లభించే ప్రోక్తం లడ్డు బరువు తగ్గిందనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
160 నుంచి 180 గ్రాముల బరువుండే ఈ లడ్డూ 90 గ్రాములకే భక్తులకు విక్రయిస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ వీడియో సారాంశం.
నిజ నిర్ధారణ
తిరుమలలో మూడు రకాల లడ్డూలు మనకు అందుబాటులో ఉంటాయి. ఆస్థాన లడ్డు (750Gms), కళ్యాణోత్సవ లడ్డు (700Gms), ప్రోక్తం లడ్డు ఇది 160 నుంచి 180 గ్రాముల మధ్యలో బరువు ఉంటుంది. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అందుబాటులో ఉంచుతారు. లడ్డూ పరిమాణం, బరువు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన నేపథ్యంలో ఫాక్ట్ చెక్ చేసి చేసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ కి సంబంధించి మీడియా రిపోర్ట్ కనిపించింది.
దీంతోపాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ ని సెర్చ్ చేసి చూసినప్పుడు శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దని, ఇదే విషయానికి సంబంధించి టిటిడి వెల్లడించిన వివరాలు ఉన్నాయి. వేయింగ్ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కారణంగా లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారని, లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుందని, కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని, అదేవిధంగా లడ్డూ బరువు, నాణ్యత విషయంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ పడలేదని అందులో ఉంది.
దీంతోపాటు గానే ఇదే విషయంపై తిరుమల లడ్డూ కౌంటర్లలో కొలతల శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన మరొక వార్త కూడా కనిపించింది. కేవలం ఒకే ఒక వేయింగ్ మెషిన్ లో వచ్చినటువంటి తప్పు వల్లే ఇంత గందరగోళం జరిగిందని, మిగితా లడ్డూలన్నీ సరైన పరిమాణం బరువు లోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
సో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ పరిమాణం బరువు తగ్గినట్టు వైరల్ అయిన వీడియో నిజం కాదు