Fact Check: భారత్ జోడో యాత్ర కోసం సల్మాన్ ఖాన్ ఓ పాటను అంకితమిచ్చారా..?

Did Salman Khan dedicate a song to Congress party's Bharat Jodo Yatra. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మత సామరస్యం, సౌభ్రాతృత్వ సందేశంతో పాటను రాహుల్ గాంధీ కోసం తీసుకుని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sept 2022 5:19 PM IST
Fact Check: భారత్ జోడో యాత్ర కోసం సల్మాన్ ఖాన్ ఓ పాటను అంకితమిచ్చారా..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మత సామరస్యం, సౌభ్రాతృత్వ సందేశంతో పాటను రాహుల్ గాంధీ కోసం తీసుకుని వచ్చారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కోసం ఈ పాటను సల్మాన్ ఖాన్ అంకితం చేశాడని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ట్విట్టర్‌లో కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి.


భారత్ జోడో యాత్ర ఇప్పటికే తమిళనాడులో పూర్తీ అయింది. కేరళలో ముగిసిన తర్వాత కర్ణాటక రాష్ట్రానికి చేరుకోనుంది.

నిజ నిర్ధారణ:

NewsMeter బృందం కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. అయితే నటుడు సల్మాన్ ఖాన్ రాహుల్ గాంధీకి లేదా భారత్ జోడో యాత్రకు ఒక పాటను అంకితం చేశాడని వార్తా నివేదిక ఏదీ కనుగొనబడలేదు.

మేము సల్మాన్ ఖాన్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను వెతికాము. కానీ అలాంటి ప్రకటన ఏదీ కనుగొనబడలేదు.

పాట, సల్మాన్ పేరు కు సంబంధించి కీవర్డ్‌లను ఉపయోగించి, మేము మళ్లీ సెర్చ్ చేసాం. ధృవీకరించిన YouTube ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన "భాయ్ భాయ్" అనే మ్యూజిక్ వీడియోను కనుగొన్నాము. ఇది సల్మాన్ ఖాన్ కు చెందిన అకౌంట్. మ్యూజిక్ వీడియో 24 మే 2020న అప్‌లోడ్ చేయబడింది. వైరల్ క్లిప్ ఈ వీడియో నుండి తీసుకోబడింది.


ఈ పాట 2020 నాటిది కాగా.. భారత్ జోడో యాత్ర 2022లో ప్రారంభించబడింది. సల్మాన్ ఖాన్ భారత్ జోడో యాత్రకు ఒక పాటను అంకితం చేసినట్లు ధృవీకరించే నివేదికలు ఏవీ కనుగొనబడలేదు. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

Claim Review:Salman Khan dedicates a song to the Congress party’s Bharat Jodo Yatra.
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:False
Next Story