ఖతార్ ఈ ఏడాది చివరిలో ఫిఫా ప్రపంచ కప్ 2022కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ కప్ సందర్భంగా ఎలా ప్రవర్తించాలో ఖతార్ ప్రభుత్వం ఇన్ఫోగ్రాఫిక్‌ను విడుదల చేసిందని చెబుతూ ఓ పోస్టు వైరల్ అవుతోంది.
అరబిక్, ఇంగ్లీషులోని ఇన్ఫోగ్రాఫిక్ ప్రపంచ కప్ కోసం ఖతార్‌ను సందర్శించే వారు ఈ నియమాలను పాటించాల్సిందేనని తెలిపింది. ఈ ప్రవర్తనలను ఉల్లంఘించడం ద్వారా ఖతారీ ప్రజలను ప్రతిబింబించమని అడుగుతున్నట్లుగా ఉంది. మద్యం సేవించడం, స్వలింగసంపర్కం, అసభ్యత, ప్రార్థనా స్థలాలను గౌరవించకపోవడం, సంగీతం, డేటింగ్, అనుమతి లేకుండా వ్యక్తుల చిత్రాలను తీయడం.. వంటివి నిషేధించినట్లు అందులో ఉంది.
ఒక ట్విటర్ యూజర్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, "ఖతార్ ప్రపంచ కప్‌ను నిర్వహించకూడదు" అని రాశారు. ఇలాంటి నిబంధనలను పెట్టడం వలన ఎవరికీ ప్రయోజనం లేదని పలువురు చెబుతూ ఉన్నారు.
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్‌లో కూడా పోస్టర్ షేర్ అవుతోంది. (వాటిని చూడటానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.)
నిజ నిర్ధారణ:
NewsMeter ఇన్ఫోగ్రాఫిక్ ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. ఇది #Reflect_Your_Respect అనే హ్యాష్‌ట్యాగ్‌తో @RYRQatar అనే ట్విట్టర్ వినియోగదారు ద్వారా పోస్ట్ చేయబడిందని కనుగొంది. ట్విటర్ బయోలో వారు "ఖతారీ గుర్తింపుకు మద్దతు ఇచ్చే ఇస్లామిక్ విలువల ఏకీకరణకు సహకరిస్తారు"(contribute to the consolidation of Islamic values which supports the Qatari identity.") అని పేర్కొన్నారు.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. "రిఫ్లెక్ట్ యువర్ రెస్పెక్ట్" అనేది 2014లో ఖతార్ మహిళల బృందం ప్రారంభించిన ప్రచారమని కనుగొన్నాము, వారు బహిరంగ ప్రదేశాలలో అనైతిక ప్రవర్తనను నిరోధించడం ద్వారా దేశం సామాజిక విలువలను కాపాడాలని కోరుకున్నారని స్థానిక దినపత్రిక అల్ షార్క్ పేర్కొంది.
ఖతార్ ఫిఫా ప్రపంచ కప్ 2022 అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ సర్క్యులేట్ అవుతున్న గ్రాఫిక్‌లను తాము జారీ చేయలేదని, ఇందులో తప్పుడు సమాచారం ఉందని పేర్కొంది."Tournament organisers have been clear since the outset that everyone is welcome to visit Qatar and enjoy the FIFA World Cup 2022. Qatar has always been an open, tolerant and welcoming nation. International fans and visitors during the FIFA World Cup will get to experience this first-hand." అంటూ అందులో పేర్కొన్నారు.
టోర్నమెంట్ నిర్వాహకులు మొదటి నుండి ఖతార్‌ను సందర్శించడానికి, FIFA ప్రపంచ కప్ 2022ని ఆస్వాదించడానికి స్వాగతం పలుకుతున్నామని స్పష్టంగా చెప్పారు. FIFA ప్రపంచ కప్ సందర్భంగా అంతర్జాతీయ అభిమానులు, సందర్శకులు తమ దేశంలోని వసతులను, ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు అని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్ఫోగ్రాఫిక్ "రిఫ్లెక్ట్ యువర్ రెస్పెక్ట్" క్యాంపెయిన్ ఖతార్ మహిళా గ్రూప్ ద్వారా సృష్టించబడిందని, ఖతార్ ప్రభుత్వం అధికారికంగా జారీ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది.