Fact Check: ఇరాన్ లో ఓ మహిళ టాప్ లెస్ గా నిరసన తెలియజేసిందా..?

Did a woman go topless in Iran to protest against the hijab policy. పోలీసు కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమిని మరణించిన తర్వాత ఇరాన్‌లో హిజాబ్ విధానానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన కొనసాగుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2022 9:30 AM GMT
Fact Check: ఇరాన్ లో ఓ మహిళ టాప్ లెస్ గా నిరసన తెలియజేసిందా..?

పోలీసు కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమిని మరణించిన తర్వాత ఇరాన్‌లో హిజాబ్ విధానానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన కొనసాగుతోంది. అయితే ఇరాన్‌లో ఒక మహిళ టాప్‌లెస్‌గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

వీడియోలో.. టాప్‌లెస్ యువతి ఇతర నిరసనకారులతో పాటూ ఉంది. భారీగా అక్కడకు చేరుకున్న వారిని ఉద్దేశించి ప్రసంగించడాన్ని చూడవచ్చు.

"ఇరాన్‌లో హిజాబ్ నిరసనల్లో టాప్‌లెస్‌గా పాల్గొన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది కానీ ఇస్లామిక్ దేశాలలో విప్లవం జరుగుతోంది. స్త్రీలు తమను కేవలం వస్తువులుగా పరిగణిస్తున్నారని వారి స్వరం పెంచుతున్నారు. ఇస్లామిక్ దేశాల పురుషులు ఇప్పటికీ 14వ శతాబ్దపు మనస్తత్వంలో ఉండిపోయారు,"("Hijab protests become topless in Iran. How future will unfold only time will tell but a revolution is taking place in Islamic countries. Their own women are raising their voice against them being treated as commodities. But islamic men are still steeped in 14th century mentality," ) అని వీడియోను షేర్ చేసిన ట్విట్టర్ వినియోగదారు రాశారు.

దీనికి సంబంధించిన పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.

చాలా మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఇలాంటి వాదనలతో వీడియోను పంచుకున్నారు. (మరిన్ని పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.)

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ బృందం వీడియోకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. అక్టోబర్‌ 1న ధృవీకరించబడిన హ్యాండిల్ రేడియో జమనే-ఆమ్‌స్టర్‌డామ్ ఆధారిత పర్షియన్ భాషా రేడియో ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడిందని కనుగొంది. మహ్సా అమినీ హత్య, ఇరాన్ తప్పనిసరి హిజాబ్ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నిలోఫర్ ఫులాడి అనే అమ్మాయి వీడియోలో ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొలంబియాకు చెందిన స్టేట్ రేడియో బ్రాడ్‌కాస్టర్ VOA ఫార్సీ చేసిన ట్వీట్ ప్రకారం ఈ వీడియో హాలండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందినదని ధృవీకరిస్తుంది. వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మహిళా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారని తెలిపారు.

అక్టోబరు 1న పర్షియన్ డచ్ నెట్‌వర్క్ ప్రచురించిన YouTube ఛానెల్ లో వేరే కోణం నుండి రికార్డ్ చేయబడిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. వీడియో వివరణలో "ఇరాన్ లో ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో ఆమ్‌స్టర్‌డామ్‌లో 1000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. నెదర్లాండ్స్‌లోని పర్షియన్ సంఘం డచ్ నగరాల్లో వివిధ ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా తన సంఘీభావాన్ని తెలియజేస్తోంది. టెహ్రాన్‌లో మహసా అమిని విషాద మరణం తర్వాత ఈ నిరసనలు మొదలయ్యాయి." అని తెలిపారు.

వైరల్ వీడియోలో కనిపించే నిరసన ప్రదర్శన.. ఇరాన్‌లోని నిరసనకారులకు సంఘీభావంగా హాలండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో తీయబడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. వైరల్ వీడియో ఇరాన్‌కి చెందినది అనే వాదనలో ఎటువంటి నిజం లేదు.

Claim Review:A woman went topless in Iran to protest against the hijab policy.
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:False
Next Story