FactCheck: క్వీన్ ఎలిజబెత్ అదే రోజున చనిపోతారని ట్విట్టర్ యూజర్ ముందుగానే చెప్పారా..?

Did a Twitter user predict Queen Elizabeth's death?. క్వీన్ ఎలిజబెత్ II చనిపోబోయే ఖచ్చితమైన తేదీని అంచనా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By అంజి  Published on  11 Sep 2022 3:45 PM GMT
FactCheck: క్వీన్ ఎలిజబెత్ అదే రోజున చనిపోతారని ట్విట్టర్ యూజర్ ముందుగానే చెప్పారా..?

క్వీన్ ఎలిజబెత్ II చనిపోబోయే ఖచ్చితమైన తేదీని అంచనా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వినియోగదారులు షేర్ చేస్తూ ఉన్నారు.

సెప్టెంబరు 8న క్వీన్ ఎలిజబెత్ మరణ వార్త అందరూ వినగా..! ఆగస్ట్ 2న "@birdtheBanana" అనే వినియోగదారు చేసిన పాత ట్వీట్ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. "Me and the Boys after successfully murdering The Queen Elizabeth II on the 8th of September, 2022." అంటూ ట్వీట్ చేశారు.

అదే తేదీన క్వీన్ చనిపోతారని అతడు ఎలా ఊహించగలిగాడంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఇలాంటి పోస్ట్‌లు ఫేస్‌బుక్‌లో కూడా చూడవచ్చు. (పోస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి)

ట్విట్టర్‌లోని చాలా మంది వినియోగదారులు "@birdtheBanana" టైమ్ ట్రావెల్ చేశాడా..? లేక క్వీన్ మరణానికి సంబంధించిన కుట్రలో పాలుపంచుకున్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

సదరు ట్విట్టర్ వినియోగదారుడు హత్య జరుగుతుందని చెప్పాడు. అయితే క్వీన్ మరణం హత్య కాదు. ఆమె వృద్దాప్యంలో వచ్చే సమస్యల కారణంగా మరణించారు. తన ట్వీట్ వైరల్ అయిన తర్వాత సదరు వినియోగదారుడు.. తాను ఎటువంటి హత్యకు కుట్రలో పాల్గొనలేదని.. తనకు ఎటువంటి లింక్ లేదని.. కేవలం కోఇన్సిడెన్స్ అంటూ ట్వీట్ చేశాడు.

"I must make it clear that this statement was merely a comedic prediction and I have no connections to any cult, religion, organization and or conspiracy," అంటూ సదరు వ్యక్తి వివరణ ఇచ్చారు.

తన ట్వీట్ కేవలం యాదృచ్చికం అని వివరిస్తూ ట్విట్టర్ వినియోగదారు విడుదల చేసిన ప్రకటనను మేము కనుగొన్నాము. తన ప్రకటన కేవలం హాస్యాస్పదమైన అంచనా అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అంటూ వివరణ ఇచ్చాడు.

దీన్ని బట్టి, వైరల్ ట్వీట్ యాదృచ్చికమని.. క్వీన్ ఎలిజబెత్ మరణాన్ని ట్విట్టర్ వినియోగదారుడు అంచనా వేయలేదని స్పష్టమైంది. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

Claim Review:A Twitter user predicted Queen Elizabeth’s death
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter
Claim Source:social media
Claim Fact Check:False
Next Story