FactCheck : 37 ఏళ్లు గాలిలోనే ఫ్లైట్ ఉందా?!
Did a Flight disappear and land after 37 years. 1955లో బయలుదేరిన ఒక విమానం విమానం 37 ఏళ్ల తర్వాత 1992 ప్రత్యక్షమైంది అంటూ
By Nellutla Kavitha Published on 7 Dec 2022 6:12 PM IST1955లో బయలుదేరిన ఒక విమానం విమానం 37 ఏళ్ల తర్వాత 1992 ప్రత్యక్షమైంది అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 57 మంది ప్రయాణికులతో అమెరికాలోని న్యూయార్క్ నుండి మయామికి బయల్దేరిన ఫ్లైట్ 37 ఏళ్ళ పాటు మాయమైపోయిందని, ఆ విమానం వెనుజ్వెలాలోని కారకాస్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్టుగా చెప్తున్న ఒక వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
https://www.facebook.com/ItsTeluguEntertainment/posts/1148233479135435/
నిజ నిర్ధారణ :
37 ఏళ్ల పాటు గాలిలోనే ఫ్లైట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో నిజం ఎంత? ఫ్యాక్ట చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన ఈ వీడియో కి సంబంధించి గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దీంతో Pan Am Flight 914 - Douglas DC-4 విమానానికి సంబంధించిన సమాచారం https://www.planeandpilotmag.com వెబ్ సైట్ లో కనిపించింది. ఇందులో ఏప్రిల్ 1 2022న ప్రచురించిన కథనం ప్రకారం 37 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన విమానం అనే వీడియోలో ఎలాంటి నిజం లేదు ఇదంతా కేవలం కల్పిత కథనం.
https://www.planeandpilotmag.com/news/pilot-talk/2020/08/06/curious-case-pan-am-flight-914/
Weekly World News లో దీనిని ప్రచురించారు. 1979 - 2007 ఉద్యమ కాలంలో అమెరికా నుంచి ప్రచురితమైందీ టాబ్లాయిడ్. ఫిక్షనల్ స్టోరీస్ కు పేరుగాంచిందీ టాబ్లాయిడ్.
https://en.wikipedia.org/wiki/Weekly_World_News
వీక్లీ వరల్డ్ న్యూస్ టాబ్లాయిడ్ మొదటిసారిగా flight 914 పేరుతో మే 7, 1985 లో ఈ కథనాన్ని ప్రచురించింది.
ఇక 7 సెప్టెంబర్ 1999 న ప్రచురించిన ఇదే కథనంలో ప్రత్యక్షసాక్షి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ Juan de la Corte అంటూ మరొక వ్యక్తి ఫోటోని ప్రచురించారు.
37 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన విమానం కథనంతో పాటుగా వీక్లీ వర్డ్ న్యూస్ టాబ్లాయిడ్ కి సంబంధించి ఒక వీడియో యూట్యూబ్ లో కనిపించింది. టైం ట్రావెల్ కి సంబంధించిన రియల్ మిస్టరీ అంటూ ఈ వీడియోను The Infographics Show పబ్లిష్ చేసింది.
ఇక ఇదే కథనం గురించి Snopes ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్ కూడా రాసింది.
The "unsolved" story of Pan Am Flight 914 reportedly involves a plane that took off from New York in 1955 with 57 passengers, disappeared for 37 years, then reappeared and landed in Miami as if nothing had happened. https://t.co/ngetGYp9kI
— snopes.com (@snopes) May 24, 2022
సో, 37 ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన విమానం అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియో లో నిజం లేదు. 37 ఏళ్ల పాటు గాలిలోనే ఫ్లైట్ అనే ఫేస్బుక్ వీడియో మిస్ లీడింగ్.