Fact Check : నెట్ ఫ్లిక్స్ లో క్రిస్టియన్ సినిమాలను తీసివేస్తూ ఉన్నారా..?

Christian Movies - Netflix. క్రిస్టియానిటీ ఉన్న సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'నెట్ ఫ్లిక్స్' నుండి తీసివేస్తున్నారంటూ

By Medi Samrat  Published on  31 March 2021 6:09 AM GMT
fact check news of Christian movies

క్రిస్టియానిటీ ఉన్న సినిమాలను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'నెట్ ఫ్లిక్స్' నుండి తీసివేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. 'The Gospel of Matthew', 'The Gospel of Mark', 'The Gospel of John', 'The Gospel of Luke' వంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండగా.. ఈ సినిమాలన్నీ క్రిస్టియానిటీతో కూడుకున్నవే..! ఈ సినిమాలు మార్చి 31, 2021 తర్వాత నుండి నెట్ ఫ్లిక్స్ లో కనపడకుండా పోతాయని ఆ వీడియోలో ఉంది.






నెట్ ఫ్లిక్స్ కావాలనే ఇలాంటి పనులు చేస్తోందని.. క్రిస్టియానిటీ ఉన్న సినిమాలను తీసివేస్తున్న నెట్ ఫ్లిక్స్ ను బాయ్ కాట్ చేయాలని పలువురు పిలుపును ఇస్తున్నారు.

Archive link:

https://web.archive.org/save/https://www.facebook.com/southjerseypatti/videos/10221655865084786

https://web.archive.org/save/https://twitter.com/iloveamanemisa/status/1373781107271864323

ఈ వైరల్ పోస్టు 2016 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది.

నిజ నిర్ధారణ:

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ క్రిస్టియానిటీ ఉన్న వీడియోలను తీసివేస్తూ ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

నెట్ ఫ్లిక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి 'Christian movies on Netflix' అని సెర్చ్ చేయగా.. పలు క్రిస్టియానిటీకి సంబంధించిన సినిమాలను సదరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చూడొచ్చు.

"Soul Surfer" (2011), "The Healer" (2017), "Freshman Year" (2019), "Like Arrows" (2018) లాంటి క్రిస్టియానిటీ సినిమాలు, మరెన్నో సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కొన్ని సినిమాలను ఎప్పుడైనా చూడొచ్చు.. కొన్ని సినిమాలను ఇతర స్టూడియోలతో లేదంటే సినిమా నిర్మాతలతో ఉన్న అగ్రిమెంట్ల ప్రకారం కొన్ని రోజులు మాత్రమే సదరు ఓటీటీలలో ప్రసారం చేసుకునే హక్కులు మాత్రమే ఉంటాయి. అలా కొన్ని టీవీ షోలు, సినిమాలు అందుబాటులో కొద్దిరోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎవరైనా చూడాలి అనుకుంటే తొందరగా చూసేయండి అంటూ ఒక డేట్ ను చూపిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది నెట్ ఫ్లిక్స్ నుండి చాలా సినిమాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు, షోలు ఎప్పటికీ అక్కడే ఉంటాయి. అలా కొన్ని సినిమాలు మార్చి 31, 2021 తర్వాత అందుబాటులో లేకుండా పోతాయని నెట్ ఫ్లిక్స్ ఖాతా దారులకు చెబుతూ ఉంటుంది. అలా కొన్ని సినిమాల గురించి చెప్పారు అంతే..!

https://help.netflix.com/en/node/60541#:~:text=Netflix licenses TV shows and,to the title still available?

https://checkyourfact.com/2021/03/24/fact-check-netflix-removing-christian-movies-march-31/

ఎన్నో క్రిస్టియానిటీకి సంబంధించిన సినిమాలు, షోలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోనే ఉన్నాయి. అంతే తప్ప కావాలనే క్రిస్టియానిటీ ఉన్న సినిమాలను నెట్ ఫ్లిక్స్ తీసేయడం లేదు.

https://www.netflix.com/in/title/81183451

https://www.netflix.com/in/title/80081151?source=35

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ క్రిస్టియానిటీ ఉన్న వీడియోలను తీసివేస్తూ ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.




Claim Review:నెట్ ఫ్లిక్స్ లో క్రిస్టియన్ సినిమాలను తీసివేస్తూ ఉన్నారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story