నిజనిర్దారణ: ఆ వీడియోలో ఉన్నది నిజమైన ఎగిరే పళ్లెమా..?

CGI animated video passed off real UFO sighting. యూఎఫ్ఓ.. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటి నుండో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. గ్రహాంతరవాసులు దీనిపై భూగ్రహం మీదకు వస్తూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2022 3:46 PM GMT
నిజనిర్దారణ: ఆ వీడియోలో ఉన్నది నిజమైన ఎగిరే పళ్లెమా..?

యూఎఫ్ఓ.. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటి నుండో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. గ్రహాంతరవాసులు దీనిపై భూగ్రహం మీదకు వస్తూ ఉన్నారని.. ఎన్నో రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించిన నిజమైన వీడియోలు అంటూ ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ వస్తుంటారు నెటిజన్లు. తాజాగా అలాంటి ఓ వీడియో మరోసారి వైరల్ అవుతూ ఉంది.

UFO కనిపించిందంటూ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. వినియోగదారులు దీనిని 'Unknown Location #UFO' అనే టైటిల్ పెట్టి షేర్ చేస్తూ వస్తున్నారు.



వైరల్ వీడియోలో, 'ఓ మై గాడ్, రెండు ఉన్నాయి' అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉండగా.. రెండు UFOలు తిరుగుతున్నట్లు మనం గుర్తించవచ్చు. కామెంట్స్ విభాగంలో వైరల్ వీడియో ఫేక్ అని క్లెయిమ్ చేసే చాలా కామెంట్‌లను మేము కనుగొన్నాము.

ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. UFOలు, గ్రహాంతరవాసుల ఉనికి ప్రజలలో చర్చించగలుగుతున్న అంశం. అటువంటి వీడియో ఏదైనా వైరల్ అవుతుంది. ప్రజలను తప్పుదారి పట్టించడం, గందరగోళాన్ని వ్యాప్తి చేయడం వంటివి వీటి వెనుక ఉండే ప్రధాన ఉద్దేశ్యం అయి ఉంటాయి.

నిజ నిర్ధారణ:

NewsMeter మూలాన్ని కనుగొనడానికి వైరల్ వీడియోను పరిశీలించింది. అందుకు సంబంధించి ఒక ఫేస్ బుక్ పేజీని కనుగొంది. 'EBE' అనే ఫేస్ బుక్ పేజీలో ఎంతో మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ పేజీలో UFO, గ్రహాంతరవాసులకు సంబంధించిన వీడియోలు మరియు చిత్రాలను పోస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పేజీ యొక్క బయోలో కూడా అదే విషయాన్ని గమనించింది మా న్యూస్ మీటర్ బృందం '"E.B.E." అంటే Extraterrestrial Biological Entity అని ఉంది.

'The 2Alien MonaLisas' అనే కాన్సెప్ట్ పేజీలను కూడా మేము గుర్తించాం. అందులో ఏలియన్స్, UFO ల గురించి చర్చించారు.



నిశితంగా పరిశీలించగా.. న్యూస్‌మీటర్ EBE పేజీలోని అన్ని వీడియోలను ఒకే పద్ధతిలో చిత్రీకరించినట్లు గుర్తించింది. ఒక వృత్తాకార వస్తువు నెమ్మదిగా వస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ వీడియోలను ఎడిట్ చేశారని మాకు స్పష్టంగా తెలిసింది.

వీడియోలోని UFO చెట్లను దాటే సమయంలో ఎడిటింగ్ లోపం ఉన్నట్లు మేము కనుగొన్నాము. వస్తువు పైకి ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. అకస్మాత్తుగా చెట్టు కొమ్మను దాటుతుంది, ఇది మాస్కింగ్‌లో లోపం కారణంగా ఏర్పడింది. వీడియో మాస్కింగ్‌తో కూడిన CGI యానిమేషన్ తో తయారు చేశారని స్పష్టంగా తెలుస్తుంది.

NewsMeter బృందం NASA అధికారిక వెబ్‌సైట్‌లో చాప్టర్ 5లో కూడా ఒక కథనాన్ని కనుగొంది. "గ్రహాంతరవాసులు ఉన్నారా? ఇది నిజంగా ఆసక్తికరమైన ప్రశ్న.. NASA చాలా కాలంగా ఇతర గ్రహాల్లో జీవరాశుల గురించి తెలుసుకోడానికి, అర్థం చేసుకోవడానికి, అన్వేషించడానికి, గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. మేము ఇంకా దానిని ధ్రువీకరించలేదు. ఇతర గ్రహం మీద జీవాన్ని కనుగొన్నట్లు, గ్రహాంతర జీవులు ఉన్నాయని తెలుసుకునే ఆధారాలను మేము కనుగొనలేదు" అని కథనం పేర్కొంది.

https://www.nasa.gov/feature/episode-5-we-asked-a-nasa-scientist-do-aliens-exist

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు సీజీఐ ద్వారా ఎడిట్ చేసిందని కనుగొన్నాం. వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.

Next Story