Fact Check : 'ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన' కింద కేంద్ర ప్రభుత్వం 1800 రూపాయలు ఇస్తోందా..?
Centre is not giving RS1800 under Pradhan Mantri Shram Yogi Maandhan Yojana.'ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 March 2022 9:45 PM IST'ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన' కింద కేంద్ర ప్రభుత్వం రూ.1800 ఇస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు.
18 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులని వినియోగదారులు తెలిపారు.
సందేశంతో పాటు లింక్ కూడా షేర్ చేయబడుతోంది. ఇందులో భాగంగా నమోదు చేసుకోవడానికి లింక్‌పై క్లిక్ చేయాలని ప్రజలను కోరారు. న్యూస్‌మీటర్‌కి వాట్సాప్‌లో వైరల్ సందేశం వచ్చింది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులు తప్పు.
న్యూస్‌మీటర్ మొదట వైరల్ టెక్స్ట్‌ను పరిశీలించింది. అందులోని పదాలు, వాఖ్యాలు ప్రామాణికమైనదిగా అనిపించలేదు.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అందులో మాకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ కి దారితీసింది. అందులో వెతకగా 'ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన' పథకం గురించిన వివరాలని కనుగొన్నాము.
"అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (PM-SYM) అనే పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది" అని ఉంది. "Government of India has introduced a pension scheme for unorganized workers namely Pradhan Mantri Shram Yogi Maan-dhan (PM-SYM) to ensure old age protection for Unorganized Workers,"
ఈ పథకం 60 ఏళ్ల వయస్సు వచ్చిన వారికి నెలకు రూ. 3000 కనీస పెన్షన్‌ను అందిస్తుంది.
మేము వైరల్ టెక్స్ట్ చివరిలో అందించబడుతున్న వైరల్ లింక్‌పై క్లిక్ చేసాము. లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత, లింక్ అందుబాటులో లేదని పేర్కొన్న పేజీకి మళ్లించబడ్డాము. పథకం కోసం దరఖాస్తు చేయడానికి, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కాకుండా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ కూడా వైరల్ సందేశాన్ని తప్పుడు వార్తగా కొట్టిపారేసింది.
కాబట్టి, వైరల్ పోస్టు తప్పు అని స్పష్టమైంది. 'ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన' 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత నెలకు రూ. 3000 కనీస పెన్షన్‌ను అందిస్తుంది.