బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. బెంగాల్ లోని హిందువుల ఇళ్లను తగులబెట్టేస్తూ ఉన్నారని, దేవాలయాలను కూల్చి వేస్తూ ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ కూడా దీనిపై సైలెంట్ గా ఉందంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతూ ఉంది.
అందులో ఓ వ్యక్తి మహిళ చీరను లాగుతూ ఉండగా.. అందరూ చూస్తూ ఉన్నారు. ఇది బెంగాల్ హిందువుల మీద జరుగుతున్న దాడులు అంటూ పలువురు ఫోటోలను పోస్టు చేశారు.
నడిరోడ్డు మీదనే మహిళలను టార్చర్ చేస్తూ ఉన్నారని.. అందరూ చూస్తుండగానే ఈ తతంగం జరిగిందని పలువురు పోస్టులు చేస్తూ వచ్చారు.
"In Bengal, the houses of Hindus are burnt, temples are being demolished. Nevertheless, the UN Shanti Duniya silent world only speaks for the Rohingyas. Gaddar will now fight for our brothers #StandWithBengalHindus (sic)" అనే పోస్టుకు మహిళ చీర లాగుతున్న ఫోటోను జోడించారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటో 2014లో వచ్చిన భోజ్ పూరి సినిమాలోనిది.
సదరు ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా INDIA.COM, ABP LIVE లో అందుకు సంబంధించిన రిపోర్టులను మనం చూడొచ్చు. అప్పట్లో కూడా ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాలలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుపగా కోల్ కతా పోలీసులు ఇది సినిమాలోని సన్నివేశానికి సంబంధించిన ఫోటో అని తెలిపారు.
2014 సంవత్సరంలో వచ్చిన భోజ్ పూరి సినిమా 'ఔరత్ ఖిలోనా నహీ' (మహిళ ఆటవస్తువు కాదు) లోనిది తెలిపారు. యూట్యూబ్ లో ఈ సినిమా కూడా ఉంది. సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 11 నిమిషాలు. ఈ సినిమాలో మనోజ్ తివారీ, మోనాలిసా, రింకు ఘోష్ లు నటించారు. అస్లాం షేక్ దర్శకత్వం వహించాడు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వైరల్ పోస్టు భోజ్ పూరి సినిమాలోనిది.