జర్మనీలో నరసింహ స్వామి శిల్పం దొరికిందన్న వాదనతో మూడు ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారు. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ శిల్పం 35,000 నుండి 40,000 సంవత్సరాల నాటిదని తేలిందని కూడా వాదిస్తున్నారు.
పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
NewsMeter ప్రతి చిత్రంపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. మొదటి ఫోటో నరసింహ భగవానుడిది కాగా.. రెండవ, మూడవ చిత్రాలు జర్మనీలోని ఒక గుహలో త్రవ్విన సింహం మనిషి ఆకారమని కనుగొన్నాము.
మొదటి చిత్రం రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించినప్పుడు, దీనిని The Sampradaya Sun ఫీచర్ స్టోరీలో ఉపయోగించినట్లు మేము కనుగొన్నాము. ఫోటో క్యాప్షన్ విగ్రహం "లార్డ్ నృసింహదేవ్" ("Lord Nrsimhadev") అని ఉంది. అది దొరికిన ప్రదేశం శ్రీధామ్ మాయాపూర్ అని అన్నారు. (ఇక్కడ ఫోటో చూడండి.)
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. శ్రీధామ్ మాయాపూర్ పశ్చిమ బెంగాల్‌లో ఉందని.. ధృవీకరించబడిన YouTube ఛానెల్ హరే కృష్ణ TV ద్వారా అప్‌లోడ్ చేయబడిన వీడియోను కూడా కనుగొన్నాము. అందులో కూడా అదే విగ్రహాన్ని చూపుతుంది. ఈ వీడియోకు "ఇస్కాన్ మాయాపూర్‌లోని నరసింహ స్వామికి అభిషేకం""Abhishek of Lord Narasimha at ISKCON Mayapur." అని పేరు పెట్టారు.
ఇతర రెండు చిత్రాల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించినప్పుడు, మేము జర్మన్ వెబ్‌సైట్ డాన్స్ మ్యాప్స్ Dons Mapsలో ఇలాంటి చిత్రాలను కనుగొన్నాము. జర్మనీలోని హోహ్లెన్‌స్టెయిన్-స్టాడెల్ గుహ నుంచి ఈ బొమ్మను వెలికితీసినట్లు అందులో పేర్కొన్నారు. ఇంతకుముందు దీనిని లయన్ లేడీ అని పిలిచేవారని, ఇప్పుడు దానిని లయన్ మ్యాన్ అని పిలుస్తున్నారని కూడా పేర్కొంది.
మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. "Lion man Take pride of place as oldest statue" అనే శీర్షికతో నేచర్ వెబ్సైట్ లో కథనాన్ని కనుగొన్నాము. కథనంలో అదే చిత్రాన్ని కలిగి ఉంది. "30,000 సంవత్సరాల పురాతన విగ్రహం.. నియాండర్తల్ లేదా ఆధునిక మానవుల పని కావచ్చు" అని పేర్కొన్నారు.
నైరుతి జర్మనీలోని ఒక గుహలో లభించిన ఏనుగు దంతపు శిల్పాలు అని చెప్పారు.
మొదటి ఫోటో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీధామ్ మాయాపూర్‌లోని నరసింహ భగవానుడిది.. మిగిలిన రెండు ఫోటోలు జర్మనీలో బయటపడిన లోవెన్‌మెన్ష్ లేదా లయన్ మ్యాన్ అని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, వైరల్ అవుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.