Fact Check : ఢిల్లీలో రైతులు ఇంత పెద్ద ఎత్తున గుడారాలను వేసుకుని ఉన్నారా..?

Aerial image of Maha Kumbh Mela passed off as farmers protest at Delhi.ఢిల్లీలో రైతులు ఇంత పెద్ద ఎత్తున గుడారాలను వేసుకుని ఉన్నారా.

By Medi Samrat  Published on  8 Jan 2021 1:16 PM GMT
formers in Delhi

ఎన్నో గుడారాలు వేసుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీ సమీపంలో రైతులు ఎన్నో రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ ఫోటోలో ఉన్న గుడారాలను వేసుకుంది రైతులేనంటూ పెద్ద ఎత్తున పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి దగ్గరలో ఉన్న సింఘు బార్డర్ లో రైతులు ఇలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారని చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు.



"Picture from world's largest protest, Singhu border, Delhi." అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గుడారాలు వేసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా "Maha Kumbh Mela – maailman suurin festivaali" అనే బ్లాగ్ లో ఫోటోలు ఉన్నాయి. 2013లో నిర్వహించిన కుంభమేళాకు సంబంధించిన ఫోటోలు ఇవని స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ కు సంబంధించిన ఫోటోలు ఇవి.

ఈ సమాచారాన్ని బట్టి ఈ ఫోటోలు 2013లో మహా కుంభమేళా నిర్వహించగా అందుకు సంబంధించిన స్టాక్ ఇమేజ్ లకు సంబంధించిన వెబ్సైట్ "Alamy" లో కూడా ఇదే ఫోటోలు ఉన్నాయి. "Tents/landscape during Maha Kumbh Mela 2013 in Allahabad, India" అంటూ ఫోటోలను పోస్టు చేశారు. ఈ ఫోటోలలో అలహాబాద్ లోని సంగం నగరి, భులాయి కా పురా రోడ్, గోవింద్ పూర్ కు చెందినదని తెలుస్తోంది. ఫిబ్రవరి 8, 2013కు సంబంధించిన ఫోటో ఇదని తెలుస్తోంది.

Getty Images సైట్ లో కూడా ఇలాంటి ఫోటోలనే మనం చూడొచ్చు. ''Maha Kumbh Mela 2013 India, Uttar Pradesh (United Provinces), Allahabad. Maha Kumbh Mela 2013, daily life of the camp, view from the bridge.'' అంటూ క్యాప్షన్ ను ఉంచారు. దీన్ని బట్టి ఈ ఫోటోలు కుంభమేళాకు సంబంధించినవేనని స్పష్టంగా తెలుస్తోంది.

2013లో కుంభమేళాకు 100 మిలియన్లకు పైగా భక్తులు హాజరు అయ్యారు. ఆ సమయంలో ఎంతో మంది భక్తులు అక్కడ టెంట్ లలో సేదతీరారు.

కుంభమేళాకు సంబంధించిన ఫోటోను ఇప్పటి రైతుల సమస్యలకు లింక్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గుడారాలు వేసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:ఢిల్లీలో రైతులు ఇంత పెద్ద ఎత్తున గుడారాలను వేసుకుని ఉన్నారా..?
Claimed By:FaceBook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story