Fact Check: నిజమెంత: ఎయిర్ ఇండియా విమానంలో సామాజిక దూరం పాటించడం లేదా..?

By సుభాష్  Published on  11 May 2020 2:50 PM IST
Fact Check: నిజమెంత: ఎయిర్ ఇండియా విమానంలో సామాజిక దూరం పాటించడం లేదా..?

విదేశాల్లో ఉన్న భారతీయులను భారత్ కు తీసుకుని రావడానికి ఎయిర్ ఇండియా 64 ప్రత్యేక విమానాలను నడుపుతోంది. మే 8న దుబాయ్, అబుదాబిలలో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేకంగా రెండు విమానాలను ఉపయోగించి 354 మందిని కొచ్చి, కోజికోడ్ లకు తీసుకుని వచ్చారు. చాలా మంది ప్రయాణీకులు ఎయిర్ ఇండియాను ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉన్నారు. సామాజిక దూరం పాటిస్తూ తగినన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రయాణీకులను భారత్ కు తీసుకుని వస్తున్నారు.



ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా విమానం నిబంధనలను పాటించలేదన్నది ఆ వీడియో పైన ఉన్న సమాచారం. ఆ వీడియోలో విమానంలో నిబంధనలను పాటించకుండా ప్రయాణీకులను తీసుకుని వస్తోందని.. అందుకు ప్రయాణీకులు నిరసన వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించేలా సీటింగ్ ఉంటుందని చెప్పిన సదరు విమానయాన సంస్థ కనీసం నిబంధనలను పాటించకపోవడంతో ఆ ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమనేమీ ఉచితంగా తీసుకుని రావడం లేదని.. డబ్బులు ఇస్తున్నామంటూ ఆ ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడ..? నాకు కరోనా వైరస్ వస్తే ఎవరి బాధ్యత అంటూ ప్రయాణీకులు ప్రశ్నించారు. చికాగో నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఘటన అంటూ చాలా మంది వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.

10

ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ వీడియోను అదే సమాచారంతో పలు పేజీలు షేర్ చేశాయి

నిజమెంత:

ఈ వీడియోను ట్వీట్ చేస్తున్న ఓ యూజర్ కు ఎయిర్ ఇండియా సంస్థ సమాధానం ఇచ్చింది. కావాలంటే ట్వీట్ ను చూడొచ్చు.



ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్' కు సంబంధించిన వీడియో. అని ‘Empire Productions’ అనే యూట్యూబ్ ఛానల్ పోస్టు చేసింది. ‘PIA_flights bringing_back_Pakistanis_from_abroad. Were passengers seated in every seat or with some gap i between?’ అంటూ టైటిల్ పెట్టారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం.. పాకిస్థానీయులను స్వదేశానికి తీసుకుని వస్తోందని.. ప్యాసెంజర్లను ఒక్కొక్క సీట్ గ్యాప్ లో కూర్చోపెట్టలేదని తెలిపారు. ఈ వీడియోను ఏప్రిల్ 26న పోస్టు చేశారు. అలాగే PIA flights not following social distancing అన్న కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ స్టోరీని ఏప్రిల్ 29న ANI కూడా పోస్టు చేసింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో అధికంగా ధరలు పెంచడాన్ని, సోషల్ డిస్టెంసింగ్ ను ప్రశ్నిస్తూ ప్రయాణీకులు ఎదురుతిరిగారని ఆ వార్త సారాంశం.

Pakistan socio-economic monitor by Yasin J అనే ట్విట్టర్ అకౌంట్ కూడా ఏప్రిల్ 26న ఈ వీడియోను పోస్ట్ చేసింది. #BreakingNews In special flights to bring home Pakistanis #PIA is not following #SocialDistancing and is price gouging for economy class seats in the name of leaving middle seats #lies vs reality” స్పెషల్ గా విమానాలను వేసి పాకిస్థానీయులను తీసుకొస్తున్నా.. కనీసం నిబంధనలు పాటించడం లేదని.. విపరీతంగా టికెట్ ధరలను పెంచారని తెలిపారు.



పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా ఎయిర్ ఇండియా వీడియో అంటూ వైరల్ అవుతున్న వార్త పచ్చి అబద్ధమని తేల్చేసింది. వైరల్ అవుతున్న వీడియో పాకిస్థాన్ కు చెందినదని క్లారిటీ ఇచ్చింది.

కాబట్టి.. సామాజిక దూరం కూడా పాటించకుండా ప్రయాణీకులను భారత్ కు తీసుకుని వస్తున్నారని ఎయిర్ ఇండియా మీద వచ్చిన వార్త 'పచ్చి అబద్ధం'

Claim Review:Fact Check: నిజమెంత: ఎయిర్ ఇండియా విమానంలో సామాజిక దూరం పాటించడం లేదా..?
Claim Fact Check:false
Next Story