Fact Check : నిజమెంత: క్యాడ్బరీ సంస్థ ఉచితంగా చాకొలేట్ బాస్కెట్లను ఇస్తోందా..?
By సుభాష్
సాధారణంగా సోషల్ మీడియాలో కొన్ని లింక్ లు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. దీన్ని షేర్ చేస్తే జియో కంపెనీ 200జీబీ డేటా ఇస్తుందని.. ఈ లింక్ లోకి వెళ్ళితే అకౌంట్ కు డబ్బులు పంపుతారని.. ఆ లింక్ ల లోకి వెళ్లి వాళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. దీని ద్వారా కలిగే ప్రమాదం చాలా ఎక్కువ.. వైరస్ లు ప్రవేశించడమే కాకుండా.. మన ఫోన్ లో ఉన్న డేటాను కూడా దొంగిలించే అవకాశం ఉంటుంది. వీటిని చాలా మంది ఫ్రాడ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్కామ్ లను టెక్నీకల్ గా 'క్లిక్ బెయిట్ ఆఫర్స్' అని అంటూ ఉంటారు. వీటి మీద క్లిక్ ఇచ్చారంటే ఏవేవో వెబ్ సైట్ లలోకి వెళ్లిపోవడం.. మనకు సంబంధించిన సమాచారాన్ని ఫిల్ చేయమని కోరడం.. ఇంకొందరికి ఫార్వర్డ్ చేస్తే ఆ గిఫ్ట్ ను అందుకోవచ్చు అంటూ చెబుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నాళ్ళ నుండో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా క్యాడ్బరీ కంపెనీకి చెందిన ఓ ఆఫర్ వాట్సప్ లో తెగ వైరల్ అవుతూ ఉంది. క్యాడ్బరీ సంస్థ 500 ఫ్రీ బాస్కెట్ల చాకోలెట్లు పంపుతోందంటూ.. అది కూడా 196వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తోంది అన్నది ఆ మెసేజీ సారాంశం. తొందరగా ఈ లింక్ ను ఓపెన్ చేయండి అని ఆ మెసేజీలో ఉంటుంది.
”Cadbury is giving away 500 Free baskets of Cadbury Chocolate to EVERYONE on its 196th ANNIVERSARY. Hurry Up! Get your free cadbury basket at : http://basket.onlineoffer.xyz” ఇది మెసేజీ..!
నిజమెంత:
ఎప్పుడైతే ఆ లింక్ మీద క్లిక్ చేస్తామో.. వెంటనే ఆ లింక్ చాలా వెబ్ సైట్ల లింక్ లకు ఓపెన్ అవుతోంది. ఈ లింక్ ల కారణంగా వైరస్, మాల్ వేర్ వంటివి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఏవేవో డౌన్ లోడ్ అయిపోతూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైంది.
గతంలో హొండా కంపెనీ 320 యాక్టీవా 5జి స్కూటర్లను ఇస్తోందంటూ కూడా ఇలాంటి లింక్ లను వైరల్ చేశారు.
ఈ లింక్ లను ఓపెన్ చేస్తే ogool.com/confirmmx.html వంటి లింక్ ఓపెన్ అయిపోతుంది. మీ వయసు 16 సంవత్సరాలా అని అడుగుతుంది. కన్ఫర్మ్ అని నొక్క గానే మరో లింక్ ఓపెన్ అవుతుంది.
వెంటనే పలు అప్లికేషన్స్ డౌన్ లోడ్ అయిపోతాయి. ఈ వెబ్ సైట్ మీద మాల్ వేర్ అనాలిసిస్ చేయగా.. అది చాలా ప్రమాదకరమైన సైట్ అని తెలిసిపోయింది.
నిజంగానే క్యాడ్బరీ సంస్థ ఇటువంటి ఆఫర్ ను అమలు చేస్తోందా అని క్యాడ్బరీ సంస్థకు చెందిన అఫీషియల్ వెబ్ సైట్స్ ను.. సోషల్ మీడియా అకౌంట్స్ ను వెతకగా.. ఈ సంస్థ అలాంటి ఆఫర్ ను పెట్టలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ.. ప్రెస్ రిలీజ్ కానీ చేయలేదు.
క్యాడ్బరీని ఇలాంటి వాటి కోసం వాడుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఈ సంస్థను ఇలానే వాడుకున్నారు. చాలా సార్లు ఇదే తరహా మెసేజీలని వైరల్ చేస్తూ ఉన్నారు సదరు ఫ్రాడ్ గాళ్లు. ఇలాంటి వాటిని ఓపెన్ చేయడం కానీ.. షేర్ చేయడం కానీ చాలా ప్రమాదకరమైన విషయమే..! కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి క్యాడ్బరీ సంస్థ ఉచితంగా చాకొలేట్ బాస్కెట్లను ఇస్తోందని వైరల్ అవుతున్న లింక్ 'పచ్చి అబద్ధం'